కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

విజయవాడ : కొత్తూరు తాడేపల్లిలో ఇళ్ల స్థలాల విషయంపై ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన అధికారులను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కొత్తూరులో వ్యవసాయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనజాక్షి పాల్గొని మాట్లాడుతుండగా తమ భూములు తీసుకునేందుకు వీల్లేదంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో రైతులను కించపరిచేలా వనజాక్షి వ్యాఖ్యలు చేయడంతో రైతులు, మహిళలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆమెను  చుట్టుముట్టి డౌన్ డౌన్ ఎం ఆర్ ఓ అంటూ నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను అక్కడ నుండి తీసుకోని వెళ్లారు.


Share

Related posts

గవర్నర్ ఎట్ హోం‌లో జగన్!

somaraju sharma

జ్యుడీషియల్ కమిషన్‌ బిల్లు ఆమోదం

somaraju sharma

భారత్ ‘చారిత్రాత్మక’ విజయం

Siva Prasad

Leave a Comment