సోషల్ మీడియా లో పాపులర్ అయ్యేందుకు కొందరు యువతీ యువకులు చేస్తున్న కొన్ని పనులు వారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో సామజిక మధ్యమాల్లో చూస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ప్రత్యేకంగా వీడియోలు తీసుకోని వాటిని సోషల్ మీడియా సైట్ లలో ఆప్లోడ్ చేసి లైక్ లు, షేర్ లు చూసుకొని మురిసిపోతుంటారు. కొందరు నీటి ప్రాజెక్టులు, సముద్రపు అలలు, బైక్ పై ఫీట్లు, జూలో జంతువుల వద్ద సెల్ఫీ వీడియోలు తీసుకొంటూ ప్రాణాల మీదకు తెచ్చుకొన్న అనేక సంఘటనలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి.

తాజాగా ఒ యువకుడు రైల్వే ట్రాక్ పక్కన నడుస్తూ.. రైల్ ఢీ కొనడం తో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి కి చెందిన అజయ్ అనే యువకుడు ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అజయ్ రైల్వే ట్రాక్ పక్కన నడుస్తుందుగా అతని స్నేహితులు సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నారు. అదే సమయంలో ఖాజీపేట నుండి బలార్ష వెళ్తున్న రైల్ అజయ్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోవడంతో అతన్ని స్నేహితులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రైల్వే పోలీసులు స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీస్ లు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ధో.. అదే రైలు బండి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కుని శస్త్ర చికిత్సలకు టార్గెట్ లు సరికాదన్న గవర్నర్ తమిళి సై