NewsOrbit
Right Side Videos న్యూస్

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

Video Viral: సాధారణంగా రోడ్డు పై వెళుతున్న సమయంలో ఎవరైనా ప్రమాదానికి గురై కిందపడితే అటుగా వెళ్లే వాళ్లు వెంటనే అగి సాయం చేస్తుంటారు. అదే విధంగా కుక్కలు చిన్న పిల్లల వెంటపడితే అక్కడ ఉన్న పెద్ద వాళ్లు వెంటనే ఆ పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు. ఇవి మానవత్వ లక్షణాలు. అయితే ఒక గృహిణి తన పెంపుడు కుక్క ఓ చిన్నారిని గాయం చేయగా ఆ బాలుడు బాధతో ఏడుస్తున్నా ఆమె ఏమీ పట్టన్నట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. చివరకు ఆ గృహిణిపై పోలీసులు కేసు నమోదు చేసే వరకూ వెళ్లింది.

pet dog bites a kid

 

వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ ఫజియాబాద్ లోని ఓ హౌసింగ్ సొసైటీ లో నివసిస్తున్న బాలుడు పాఠశాల నుండి ఇంటికి వచ్చే క్రమంలో లిఫ్ట్ ఎక్కాడు. ఆ తర్వాత ఓ గృహిణి తన పెంపుడు కుక్క (శునకం) తో ఆ లిఫ్ట్ లో ఎక్కింది. అయితే లిఫ్ట్ లోకి వచ్చిన కొద్దిసేపటికే కుక్క ఆ బాలుడిని కరిచింది. దీంతో ఆ బాలుడు బాధతో విలవిలలాడిపోయాడు. కుక్క చేసిన గాయంతో ఆ బాలుడు ఏడుస్తున్నా ఆ కుక్క యజమాని (గృహిణి) మాత్రం తనకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా ఉండిపోయింది. ఆ బాలుడిని అలా చూస్తూనే ఉండిపోయింది కానీ కనీసం సారీ కూడా చెప్పలేదు. మరల ఆ బాలుడు లిఫ్ట్ నుండి బయటకు వెళ్లే సమయంలోనూ కుక్క దాడికి యత్నించింది. అయితే దీనికి సంబంధించి దృశ్యాలు లిఫ్ట్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఈ వీడియోను అకాశ్ అశోక్ గుప్తా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఆ మహిళ చర్యలను విమర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్  కావడంతో నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. జాలి, మానవత్వం లేని ఆ మహిళను శిక్షించాలంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. బాలుడి తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు స్వీకరించి ఆ కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు.

వీడియో లీక్ వ్యవహారంపై ఏపీ సీఐడీకి వైసీపీ ఎంపీ గోరంట్ల ఫిర్యాదు

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N