నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో` మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ సోయగం.. తక్కువ సమయంలో తనదైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కన్నడ, తమిళ భాషల్లోనూ బాగానే సత్తా చాటుతున్న రష్మికలో ఇప్పుడు టెన్షన్ మొదలైదట.
ఆమె తొలి బాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధం అవ్వడమే రష్మిక టెన్షన్‌కు కారణమట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`, `యానిమల్`, `గుడ్ బై` చిత్రాలు చేస్తోంది. అయితే వీటిలో మొదట `గుడ్ బై` చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందులో రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో అమితాబ్, నీనా గుప్తా నటించారు.
వికాస్ బహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే బాలీవుడ్ లో తొలి సినిమా విడుదల కావడం వల్ల రష్మిక కాస్త ఖంగారు పడుతోందట. మరి అక్కడ ఈ పాప ఎంట్రీ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.