NewsOrbit
రాజ‌కీయాలు

పవన్ కీలక ప్రకటన!

అమరావతి: ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలనుకుంటున్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని విస్తరించింది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. కొత్తగా మరో నలుగురు సభ్యులకు స్థానం కల్పించారు. పంతం నానాజీ, మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పితాని బాలకృష్ణలను జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వీరి పేర్లను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇక, విశాఖలో ‘లాంగ్ మార్చ్’ ను విజయవంతం చేసినందుకు సత్య బొలిశెట్టి, శివశంకర్ తమ్మిరెడ్డిలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, త్వరలోనే వీరిద్దరికీ పార్టీలో కీలక పదవులు అప్పగిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా వీరి పదవులు ఉంటాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇక పార్టీ అధికార ప్రతినిధులుగా మరో ముగ్గురు పేర్లను పవన్ ప్రకటించారు. పండా సుజాత, సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కర్ రావులను జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్టు పవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రజల పక్షాన నిలిచేందుకు వారు చేస్తున్న కృషి అమోఘం అని పవన్ కొనియాడారు. అంతేకాదు, విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహణలో విశేషంగా తోడ్పాటు అందించారంటూ పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, వీవీ లక్ష్మీనారాయణ, కొణిదెల నాగబాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Leave a Comment