NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాజ్యసభలో ఇబిసి బిల్లు

ఢిల్లీ, జనవరి 9: కేంద్రం బుధవారం రాజ్యసభలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు వీలుగా 124వ రాజ్యంగ సవరణ బిల్లును రూపొందించింది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర మంత్రి ధావర్ చంద్ గెహ్లాట్ ప్రవేశపెట్టారు.

విదేశాల నుంచి వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన మరో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ విపక్ష సభ్యులు గొడవ చేస్తుండగానే మంత్రి ఇబిసి కోటా బిల్లును ప్రవేశపెట్టారు. గందరగోళం మధ్యనే డిప్యూటి చైర్మన్ సభను కొనసాగించారు. ఈ బిల్లు ఎన్నికల తమాషా అని ఒక పక్క అంటూనే కాంగ్రెస్ సభ్యులు దీన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంటున్నారు. డీఎంకె ఎంపి కనిమొళి బిల్లులో సవరణలను కోరారు.

బిల్లుపై చర్చ మొదలు పెట్టేముందు సెలెక్ట్ కమిటీకి పంపాలని సిపిఐ, డిఎంకె సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యసభను ఒక రోజు పొడిగించడంపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి గెహ్లాట్, ‘అగ్రకులాల్లోని పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకోవడానికి బ్యాంకు రుణాలు కూడా తీసుకుంటున్నారు. పేద గొప్ప అన్న తారతమ్యం లేకుండా సామాజిక న్యాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు. విపక్ష సభ్యల ఆందోళనతో మధ్యాహ్నం 2గంటలకు సభ వాయిదా పడింది.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Leave a Comment