వరస హిట్స్ తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో నితిన్ స్పీడ్ కి లై సినిమా బ్రేకులు వేసింది.. మెగా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, లైపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఆకాష్ కి మొదటి సినిమాతో భారీ ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వచ్చింది.. ఆ తర్వాత కూడా ఏడాది గ్యాప్ తీసుకొని నితిన్ తో చల్ మోహన రంగా అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ బ్యూటీ.. మరోసారి నిరాశ పరిచింది.. ఇక తెలుగులో అమ్మడి కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యింది అనుకుంటున్న సమయంలో కోలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తుంది.
తెలుగులో అవకాశాలు తగ్గినా కూడా తమిళ్ లో మాత్రం స్టార్ హీరో ధనుష్ తో ఎన్నై నొక్కి పాయుమ్ తూటా సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ పెట్టాలో ఛాన్స్ కొట్టేసి ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కిన పేట సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాలో మేఘా ఆకాష్ చేసింది చిన్న పాత్రే అయినా కూడా తెరపై అందంగా కనిపించింది, పేటకి కోలీవుడ్ లో మంచి వసూళ్లే వస్తుండంతో అక్కడ మేఘా ఆకాష్ కి హిట్ పడినట్లే.
నిజానికి తమిళ్ లో తను నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాకముందే శింబు హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న అత్తారింటికి దారేది తమిళ వెర్షన్ లో కథానాయికగా కూడా ఛాన్స్ తెచ్చుకుంది.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పుడు మేఘా ఆకాష్ చేతిలో మిగిలున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించగల చిత్రాలే.. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా కూడా మేఘా ఆకాష్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లిపోతుంది… కోలీవుడ్ లో ఒక్క భారీ హిట్ పడితే చాలు మేఘాని మళ్ళీ తెలుగు తెరపై చూడొచ్చు అనుకుంటున్న సమయంలో, హిట్ కొట్టక ముందే టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ఫైనల్ అయ్యింది. అవకాశాలైతే వస్తూనే ఉన్నాయి, సాలిడ్ హిట్ మాత్రం పడట్లేదు. మరి నానితో చేయబోయే సినిమా అయినా మేఘా ఆకాష్ కెరీర్ ని పూర్తి స్థాయిలో నిలబెడుతుందేమో చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!