NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

పాకిస్తాన్ కు బుద్ధి చెబుతాం: భారత సైన్యాధిపతి రావత్

ఢిల్లీ, జనవరి 15: సరిహద్దుల వద్ద పాల్పడుతున్న చర్యలకు ప్రతిగా తాము పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి వెనకాడబోమని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు.

ఆర్మీ దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత సైనికులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ‘సరిహద్దుల్లో పాక్‌ దాడులకు భారత బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానం చెబుతున్నాయని అన్నారు.

అక్కడ ఉన్న మన  శత్రువులను  నేను   హెచ్చరిస్తున్నాననీ, ఏవైనా హానికర చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని ఆయన స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామని చెప్పారు.

పాక్‌ ఉగ్రవాదులకు వారి మద్దతును కొనసాగిస్తోందనీ, ఆ రాష్ట్రంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదని మేము భావిస్తున్నామని ఆయన అన్నారు.

మన పక్క దేశం ఉగ్ర చర్యలను ప్రోత్సహిస్తోంది..

ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి, వారికి ఆయుధాలు కూడా ఇస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితులను ఉద్దేశించి రావత్‌ మాట్లాడుతూ… ఇరు దేశాలు తమ భద్రతా బలగాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయని తెలిపారు.

తూర్పు సరిహద్దుల వద్ద శాంతి, ప్రశాంతతల కోసం కృషి కొనసాగుతోందని చెప్పారు.

అయినప్పటికీ, మేము అక్కడి పరిస్థితిని సమీక్షిస్తాం.

ఆ ప్రాంతంలో మన సైనికులు ఎటువంటి రాజీ ధోరణితో వ్యవహరించబోరని ఆయన అన్నారు.

ప్రభుత్వం నుంచి వారికి అందిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నారు’ అని తెలిపారు.

ఈశాన్య భారత్‌లో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని, ఆర్మీ క్రమం తప్పకుండా తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌లు కొనసాగిస్తోందని చెప్పారు.

భద్రతా బలగాలతో పాటు వారి కుటుంబాలు సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని రావత్‌ సూచించారు.

భవిష్యత్తులో దేశానికి భద్రతా పరమైన సవాళ్లు మరిన్ని ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గట్లు తాము సిద్ధమవుతామని, దేశ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

Leave a Comment