NewsOrbit
న్యూస్

మాస్కొ: రెండు నౌకలు దగ్ధం : 11మంది మృతి

మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ నౌకలలో ఇండియా, టర్కీ, లిబియా దేశాలకుకు చెందిన సిబ్బంది ఉన్నారు. రెండు నౌకలు టాంజానియో జెండాలతో నడుస్తున్నాయి.

రష్యా న్యూస్ ఏజన్సీ టాస్ తెలిపిన సమాచారం ప్రకారం..ఒక నౌక నుండి మరొక నౌకలోకి ఇంధనం మారుస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన క్యాండీ అనే నౌకలో 17మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో  తొమ్మిది మంది టర్కీ పౌరులు, ఏడుగురు భారతీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు తీర ప్రాంత రక్షణదళ అధికారులు వెల్లడించారు.

ఒక నౌకలో మొదట పేలుడు సంభవించి మంటలు మరో నౌకకు విస్తరించాయి. ప్రమాదం జరగడంతో రెండు నౌకల్లోని 32మంది సముద్రంలోకి దూకారని వారిలో ఇప్పటి వరకూ 12మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి చేర్చారని వార్తీ సంస్థ తెలిపింది. మిగిలిన వారిలో 11మంది మృతి చెందగా తొమ్మిది మంది నావికుల ఆచూకి తెలియరాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలు జాప్యం అవుతున్నాయి.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Leave a Comment