Chittoor: చిత్తూరు వద్ద 16 మంది అంతరాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.40 లక్షల విలువైన 160 కిలోల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో చెన్నై – బెంగళూరు రోడ్డులోని యర్రావారిపాలెం వద్ద వేరు వేరు ప్రదేశాల్లో తనిఖీలు చేసి ట్రక్కు, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు నుండి చెన్నై వైపు వేగంగా వెళుతున్న ఎస్ యూ వీ కారును ఆపి తనిఖీ చేయయగా అందులో అయిదు ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కారును అనుసరిస్తున్న మరో వాహనంలో ఏడు ఎర్రచందనం దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపి నుండి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారుతుంది – సీఎం జగన్