Tenth Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించడంతో పాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 11.5 లక్షల మంది విద్యార్ధుల పరీక్షలు రాయనున్నారు. రెండు రాష్ట్రాల్లో పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి ప్రభుత్వాలు.

ఏపిలో..
ఏపిలో ఈ రోజు నుండి 18వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల కోసం 3,449 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపిలో మొత్తం 6,64,152 మంది రెగ్యులర్ విద్యార్ధులు పరీక్షలు రాయనుండగా, సప్లమెంటరీ విద్యార్ధులు 53,410 మంది ఉన్నారు. మొత్తం 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో 156 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులతో సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో ..
తెలంగాణ వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హజరుకానున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విధుల్లో 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష కొనసాగనుంది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్ధుల కోసం అయిదు నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 9.35 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్ధుల పరీక్షలకు హజరు కానుండగా, వారిలో 76.5 శాతం మంది ఇంగ్లీషు మీడియానికి చెందిన విద్యార్ధులు ఉండటం విశేషం. ఈ రోజు నుండి 13వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.
ఏపిలో విద్యార్ధులకు కీలక సూచనలు ఇవి
ఉదయం 8.45 నుండి 9.30 లోపు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి ఉండదు.
ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ లు, బ్లూటూత్ పరికరాలు తీసుకురాకూడదు.
అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12,45 గంటల లోపు విద్యార్ధులు బయటకు పంపరు.
వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్, ఇతర స్టేషనరీని సెంటర్ లోకి తీసుకువెళ్లవచ్చు.
కేబినెట్ విస్తరణలపై కీలక అప్ డేట్ ఇచ్చిన మాజీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని