NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amith Shah : షాకింగ్ అంటే ఇదే : ఆంధ్ర ప్రదేశ్ కి అమిత్ షా ?

Amith Shah : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలన తీరుపై ఓ పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో పక్క బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా వామపక్షాలు కూడా పలు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రారంభంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత మనోహర్ తదితరులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో నామినేషన్ లు దాఖలు చేయడమే ఓ పెద్ద సమస్యగా ఉందని కూడా సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ల స్వీకరణ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు.

Amith Shah ap tour
Amith Shah ap tour

రాష్ట్రంలో శాంతి భద్రతలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇటీవల బీజెపీ నేతలు కేంద్రానికి వివరించారు. అదే విధంగా టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఓ వినతి పత్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి అందించారు. దీంతో రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు అమిత్ షా రావచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజెపీ నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావడానికి అమిత్ షా సిద్దమైనట్లు సమచారం. మార్చి 4, 5 తేదీలలో అమిత్ షా తిరుపతి పర్యటన ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నీటి వివాదాల పరిష్కారానికి తిరుపతిలో 4వ ముఖ్యమంత్రులతో అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఈ సమావేశంలో నదుల అనుసంధానం అంశంపై ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా మార్చి 5వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక అంశంపై పార్టీ నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంపై బీజెపీ – జనసేన మధ్య ఇంత వరకూ ఏకాభిప్రాయం రాలేదు. అదే రోజు బీజెపీ, జనసేన నేతలతో చర్చించి ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది. అదే విధంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఫిర్యాదులపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N