18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఎక్కడంటే..?

Share

సీఎం కేసిఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నేడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలోనూ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తొంది. అయితే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ను ఏపిలో ఎక్కడ నిర్వహించనున్నారు అనే విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ రోజు వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో పాల్గొన్న సందర్భంలో తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ. పలు కీలక కామెంట్స్ చేశారు. ఆయనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు.

Thota Chandrasekhar

 

ఏపిలో తొలి బీఆర్ఎస్ బహిరంగ విశాఖపట్నంలో ఉంటుందని తోట చంద్రశేఖర్ తెలిపారు. త్వరలో నిర్వహించే ఏపీ బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనేందుకుు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ విశాఖ విచ్చేయనున్నట్లు చెప్పారు. అనేక మంది నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. త్వరలోనే బీఅర్ఎస్ లోకి ఏపి నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. విశాఖలో బహిరంగ సభ నిర్వహించే తేదీలను కేసిఆర్ త్వరలోనే ప్రకటిస్తారని తోట వెల్లడించారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు చేసిన మియాపూర్ భూముల ఆరోపణలపైనా స్పందించారు తోట చంద్రశేఖర్. రఘునందనరావు ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తనకు 4వేల కోట్ల విలువైన స్థలాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తొందన్నారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తోట చంద్రశేఖర్ అన్నారు. పనికి మాలిన ఆరోపణలను బీజేపీ నేతలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. అదే నిజమని నిరూపిస్తే ఆ సర్వే నెం.లో తనకు ఉన్న భూమిలో 90 శాతం వారినే తీసుకోవాలనీ, మిగిలిన 10 శాతం తనకు ఇస్తే చాలని అన్నారు తోట చంద్రశేఖర్. బీఆర్ఎస్ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వివిధ రాష్ట్రాల విస్తరణలో భాగంగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడుగా జనసేన మాజీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను కేసిఆర్ నియమించిన సంగతి తెలిసిందే.

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాల కలకలం.. టార్గెట్ ఈ సంస్థలే..?


Share

Related posts

అదే నిజమైతే… ముద్రగడ కీలకంగా మారబోతున్నట్లే!

CMR

Bahubali: బాహుబలిలో ప్రభాస్ ప్రమాణస్వీకారం చేసే సీన్.. రాయటానికి కారణం ఆ హీరో యొక్క ప్రభావమే అన్న విజయేంద్రప్రసాద్..!!

sekhar

Diamond: ఆ రైతు అదృష్టం పండింది..! ఒక్క రోజులోనే కోటీశ్వరుడైయ్యాడు..! అదేలా అంటే..?

somaraju sharma