CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కొత్త బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ఆయన తన క్యాంప్ కార్యాలయం నుండి ఇవేళ ప్రారంభించారు. ప్రజలు ఏ సమస్యనైనా నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపారు. పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకే ఇలాంటి బృహత్తర పథకాన్ని ప్రవేశపెడుతున్నామని జగన్ తెలిపారు. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు సీఎం జగన్.

ప్రభుత్వ సేవలు అందకపోతే నేరుగా 1902 నెంబర్ కు కాల్ చేయవచ్చని జగన్ తెలిపారు. వివక్షతకు తావులేని వ్యవస్త తీసుకురావాలనే జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. అర్హత ఉన్నా పథకాలు అందకపోయినా వెంటనే ఫిర్యాదు చేయవచ్చని, అర్హత ఉన్న వాళ్లందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతే నేరుగా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చని, వెంటనే సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు.
మారుమూల గ్రామాల నుండి జిల్లా స్థాయి వరకూ ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సమస్య పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందన్నారు. ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. సీఎం, సీఎస్, డీజీపీ ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారనీ, సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తానని ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు జగన్.
Breaking: హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కదలికలు ..? 16 మందిని అరెస్టు చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్