NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Jagan: ఏపీలో అమలు చేయనున్న జీపీఎస్ దేశానికే ఆదర్శమవుతుందన్న సీఎం జగన్

Advertisements
Share

CM Jagan: ఏపీలో సీపీఎస్ అంశంపై సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత ఎంప్లాయస్ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. సీపీఎస్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సీపీఎస్ బదులు తమ ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకువస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో ఏపీ ఎన్జీవో ల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్యారెంటీీడ్ పెన్షన్ స్కీమ్ పై త్వరలోనే ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి భారం పడకుండా ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisements

ఏపీలో అమలు చేయబోయే జీపీఎస్ దేశమే కాపీ కొడుతుందన్నారు సీఎం జగన్. నాడు – నేడు ద్వారా కార్పోరేట్ పాఠశాలల ధీటుగా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు, ప్రభుత్వ వ్యవస్థలు బాగుంటేనే ప్రజలు, ఉద్యోగులు బాగుంటారని అన్నారు. రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి పరిపాలన ను విస్తరించామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు కల్పించిన మేళ్లను వివరిస్తూ చంద్రబాబు హయాంలో జరిగిన అన్యాయాలను ఎత్తిచూపారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా మన ప్రభుత్వమే అంత కంటే మిన్నగా ఉన్నామనీ చెప్పారు.

Advertisements

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులు ఉద్యోగులనీ, గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఏమీ పట్టించుకోలేదని ఎన్నికలకు ముందు మభ్యపెట్టే పనులు చేశారన్నారు. గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించామన్నారు. బాబు హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం జగన్. జన్మభూమి కమిటీ ల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నడీఏ ఒకటి దసరా కానుకగా అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Share
Advertisements

Related posts

కోటికి చేరిన ఫాలోయర్స్

somaraju sharma

బాబే బయటపెట్టిన కరోనా తాజా కుంభకోణం ! అసలక్కడ ఏం జరిగింది ?

Yandamuri

Sabaku Namaskaram: “సభకు నమస్కారం” అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్..!!

bharani jella