టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జగన్మోహనరెడ్డి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. అమరావతి ల్యాండ్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే క్విడ్ ప్రోకో కు చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ పాల్పడ్డారన్న అభియోగంపై కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకో లో భాగంగా లింగమనేని రమేష్ నుండి చంద్రబాబు గెస్ట్ హౌస్ తీసుకున్నారన్న ఆరోపణలపై పలు సెక్షన్ ల కింద ఏపి సర్కార్ కేసులు నమోదు చేసింది. దీంతో లింగమనేని గెస్ట్ హౌస్ ను ఆటాచ్ చేసింది.

రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములకు మంచి ధర లభించేలా అలైన్ మెంట్ మార్చారని ఆరోపణలు వచ్చాయి. లింగమేనికి లబ్ది చేకూర్చినందుకు ఈ గెస్ట్ హౌస్ ను తీసుకున్నారన్నది అభియోగం. ఈ కారణంగా చిన్న చిన్న రైతులు నష్టపోయారని ప్రభుత్వం వాదిస్తొంది. రూ.3.66 కోట్ల తో నారాయణ విద్యా సంస్థలలో పని చేసిన ఒక వ్యక్తి బినామీ పేరు మీద కొనుగోలు చేసారని చెబుతోంది. ఏపీ సీఐడీ ఈ మేరకు చంద్రబాబు నివాసం ఉన్న లింగమేని గెస్ట్ హౌస్ ను ఆటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసింది ప్రభుత్వం.
అగ్నిప్రమాదం కేసు పరిశీలనకు వెళితే .. పోలీసులకు ఊహించని షాక్