NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు .. హైకోర్టు ఏమన్నదంటే..?

Advertisements
Share

AP High Court Chandrababu Case: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఉదయం నుండి సుదీర్ఘంగా వాదనలు సాగాయి. కేసులో ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ వాదనలు సాగాయి. వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తూ రెండు రోజుల్లో ఉత్తర్వులు వెల్లడిస్తానని తెలిపింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపిస్తూ చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. అవినీతి నిరోధక చట్టంలో తీసుకువచ్చిన సవరణల ప్రకారం ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి అనేక తీర్పులు ఉన్నాయని ఉదహరించారు. అర్నబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును సాల్వే ఉదహరించారు. 2021 లో నమోదైన ఎఫ్ఐఆర్ తో ఇప్పుడు చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేసే సమయానికి ఎఫ్ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరు లేదని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతనే అరెస్టు చేయాలన్నారు.

Advertisements

చంద్రబాబు విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క రోజు అక్రమంగా జైలులో ఉన్న మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ మేరకు రోమిలా థాపర్ కేసును సాల్వే ప్రస్తావించారు. పీసీ యాక్ట్ 17 ఏ పై సాల్వే వాదనలు వినిపించారు. ఎన్నికల దృష్ట్యా దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో వేశారన్నారు. సెక్షన్ 17 ఏ పై తగిన అనుమతులు తీసుకోలేదన్నారు. ఈ కేసు లో ఎఫ్ఐఆర్ చట్టవిరుద్దమైందని హరీష్ సాల్వే పేర్కొన్నారు.   గత జడ్జిమెంట్ లను అడ్వొకేట్ జనరల్ తప్పుగా అన్వయించారని, నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదనీ, దర్యాప్తు వేళ చట్టబద్దత పరిగణించాలన్నారు. 2020 లో నమోదైన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదన్నారు. సీబీఐ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు అరెస్టు అయి పది రోజులే అయ్యిందని ఆయన పిటిషన్ ఇప్పుడు స్వీకరించాల్సిన సమయం కాదన్నారు. 900 పేజీల డాక్యుమెంట్ ను కోర్టులో దాఖలు చేశారు. పథకం ప్రకారమే స్కామ్ జరిగిందన్నారు. కేసుపై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి విత్ డ్రా చేశారన్నారు. చంద్రబాబు క్వాష్ కు అనర్హుడని రోహత్గీ అన్నారు.

Advertisements

సీఐడీ తరపున న్యాయవాది రంజిత్ వాదనలు వినిపిస్తూ నిందితులకు ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేసిందన్నారు. రూ.200 కోట్ల మేర నిధులను మళ్లించినట్లుగా ఐటీ తన ఫొరెన్సిక్ ఆడిట్ లో గుర్తించిందన్నారు. ప్రైవేటు కంపెనీ లు ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వానికి చెందిన రూ.300 కోట్లు రిలీజ్ చేశారన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే కుట్ర జరిగిందని, షెల్ కంపెనీలకు సైతం చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాధమిక విచారణ జూన్ 5, 2018 న జరిగిందన్నారు. అంటే 2018 లో సెక్షన్ 17 ఏ సవరణకు ముందే ఇది పూర్తియిందన్నారు. 2015 నుంచే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఆరోపణలు ఉన్నాయన్నారు. ఒక సెక్షన్ కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదన్నారు. ఈ కేసులో శుక్రవారం కౌంటర్ ఫైల్ చేస్తామని తెలియజేయగా, వాదనలు ఇవేళే పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. సీఐడీ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో చంద్రబాబు లాయర్లు అర్నబ్ గోస్వామి కేసును ఉదహరించారనీ, అర్నబ్ గోస్వామిది వాక్  స్వాతంత్ర్య హక్కుకు సంబంధించిందన్నారు. ఆ కేసుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుండి పథకం ప్రకారం స్కామ్ జరిగిందన్నారు. సెక్షన్ 482 పిటిషన్ల పై నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు నిచ్చిందన్నారు. అరెస్టు చేయకూడదంటూ హైకోర్టులు ప్రతిసారి జోక్యం చేసుకోవద్దంటూ నిహారిక కేసులో సుప్రీం తీర్పు నిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. బాబు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తూ చంద్రబాబును ఈ కేసులో ఏ 1 అంటున్నారనీ, నిదులు విడుదల చేసిన వ్యక్తే అసెంబ్లీలో ప్రకటన చేశారన్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే లేదా కుంభకోణం కుట్ర ఉంటే సభలో ఎందుకు ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. సెక్షన్ 17 ఏ సవరణ ఈ కేసుకు వర్తిస్తుందనీ, గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారన్నారు.  ఈ కేసును రఫెల్ కేసుతో పోల్చవచ్చు, ఆ కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసుకోవాలన్నారు. సీమెన్స్ కంపెనీ నుండి వచ్చిన ఈ మెయిల్ కు రిమాండ్ రిపోర్టుకు తేడా ఉందని తెలిపారు.  ఇలా ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తూ రెండు రోజుల్లో అర్డర్స్ ఇస్తానని తెలిపింది.

Janasena: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ! Election Commission Of India


Share
Advertisements

Related posts

AP CM YS Jagan: రాష్ట్రంలో నేడు 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేస్తున్న  సీఎం వైఎస్ జగన్

somaraju sharma

TRS: ఔను బానిస‌నే అంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

sridhar

ఐఓసీఎల్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది..

bharani jella