NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ! Election Commission Of India

Advertisements
Share

Janasena: కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరో సారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల ఎన్నికల సంఘానికి ఆ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్ధులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు.

Advertisements

ఏపీలో 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఏడు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ ఏపీ, తెలంగాణలో పోటీకి జనసేన సిద్దమవుతోంది. అయితే కొంత కాలం క్రితం జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో జనసేన పార్టీకి ఇక గ్లాసు గుర్తు ఉండబోదంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరుపన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈసీ జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఇప్పటి వరకూ దీనిపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

Advertisements

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


Share
Advertisements

Related posts

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

somaraju sharma

మాట.. ఎన్నికల తూటా : కులం… రాజకీయ వ్యూహం.. !! పవన్ వ్యాఖ్యల వెనుక చాలా ఉంది

Comrade CHE

TS Minister Harish Rao: మంత్రి హరీష్ రావుకు తృటితో తప్పిన ప్రమాదం..!!

somaraju sharma