Samantha Naga Chaitanya: 2021లో హీరోయిన్ సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకోవడం తెలిసిందే. తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకే విడిపోవడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది. ఏ కారణంగా ఈ ఇద్దరు విడిపోయారు అన్నది చాలా రోజులు ఎవరికి అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమ పై జరుగుతున్న ప్రచారం పల్లె గొడవలు వచ్చి విడిపోయినట్లు ఈ ఏడాది ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నాగచైతన్య స్పష్టం చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఇద్దరు ఎవరికివారు సినిమా రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం చాలావరకు సమంతా కెరియర్ .. చాలా విజయవంతంగా సాగింది.

హిందీలో ఫ్యామిలీ మెంబర్ సిరీస్, పుష్పలో ఐటెం సాంగ్.. చేసి హీరోయిన్ గా ఫామ్ లోకి రావడం జరిగింది. కానీ తర్వాత మయోసైటీస్ అని అరుదైన వ్యాధి బారిన పడింది. కానీ సమంత కెరియర్ తో పోలిస్తే నాగచైతన్య సినీ కెరియర్ చూస్తే అంతంత మాత్రంగానే అన్నట్టు ఉంది. ఈ క్రమంలో వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలను అందిపించుకునే రీతిలో చైతు వ్యవహరిస్తూ ఉన్నారు.

తాజాగా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ లో నాగచైతన్య భాగస్వామి అయ్యారు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో ఒక టీం హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్.. జట్టును కొనుగోలు చేయడం జరిగింది. ఇండియన్ రేసింగ్ లలో గత నాలుగు సార్లు గెలిచిన ఈ టీం త్వరలో NIA ఫార్ములా 4.. ఇండియన్ ఛాంపియన్షిప్ రేసింగ్ లో.. పాల్గొనబోతోంది. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి మోటార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని అటువంటిది ఈ జట్టులో భాగస్వామ్యం కావడం.. చాలా సంతోషాన్ని కలిగిస్తుందని నాగచైతన్య స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో వ్యాపార రంగంలో చైతన్య మంచి నిర్ణయం తీసుకున్నారని సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత బిజినెస్ పరంగా చైతన్య కెరియర్ కొనసాగించడం మొట్టమొదటి మంచి పనితో పాటు ఇది బెస్ట్ ఐడియా.. అంటూ నాగచైతన్యాన్ని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.