NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Advertisements
Share

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీలో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. ఇదే నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డ్ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారంట్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisements

దీంతో చంద్రబాబు తరపున హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేయగా ఇవేళ విచారణకు వచ్చింది. చంద్రబాబు తరపున హైకోర్టులో సిద్ధార్ధ లూథ్రా, అగర్వాల్, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఏఏపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. మరో పక్క స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.

Advertisements

Share
Advertisements

Related posts

సాయి పల్లవి కి శేఖర్ కమ్ముల అంతకు మించి అంటోంది ..!

GRK

బ్రేకింగ్ : జగన్ ఫేవరెట్ మ్యాటర్ మీద అసంబ్లీ లో అద్దరగొట్టేసిన గవర్నర్ స్పీచ్

arun kanna

‘ఆర్‌టిసిలో ‘మేఘా’ పథక రచన!’

somaraju sharma