వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు ఆ జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు, పలువురు ప్రజా ప్రతినిధులు హెలిపాడ్ వద్దకు బయలుదేరారు.

అయితే మార్కాపరం హెలిపాడ్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని బాలినేనికి పోలీసులు సూచించారు. పోలీసుల తీరుపై బాలినేని మండిపడ్డారు. ఈ పరిణామంతో అలిగిన బాలినేని హెలిప్యాడ్ కు రాకుండా వెనుదిరిగారు. ఇది గమనించిన మంత్రి ఆదిమూలపు సురేష్ .. బాలినేనికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా మనస్థాపానికి గురైన బాలినేని అక్కడ నుండి సీఎం సభ వద్దకు వెళ్లకుండానే ఒంగోలుకు బయలుదేరారు. ప్రస్తుతం బాలినేని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపటి తర్వాత సీఎం వ్యక్తిగత సిబ్బంది ఫోన్ రావడంతో బాలినేని మెత్తబడి సీఎం సభకు వెళ్లారు.
బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఆయన అనుచరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కొద్దిసేపటిలో మార్కాపురంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈబీసీ నేస్తం లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.
Eluru TDP: బావ వద్దు.. బావమరిదే ముద్దు..!