TTD News: తిరుమల శ్రీవారికి రూ.కోట్ల విరాళం అందించిన భారత్ బయోటెక్..

Share

TTD News: తిరుమల శ్రీవారికి భారత్ బయోటెక్ భారీ విరాళాన్ని అందించింది. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు ఆ సంస్థ అధినేత శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలకు ఈ విరాళం చెక్కును వారు అందజేశారు. అనంతరం శ్రీవారి సేవలో వారు పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వేళ పెద్ద ఎత్తున కోవాగ్జిన్ టీకా పంపిణీ చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు పిల్లల వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత్ బయోటెక్.

Bharat Biotech donates rs 2 crore to TTD
Bharat Biotech donates rs 2 crore to TTD

 

Read More: RRR: చంద్రబాబుకు పెద్ద పరీక్ష పెడుతున్న రఘురామ కృష్ణం రాజు ? ఊ అనలేడు .. ఊఊ అనలేడు..!!

TTD News: వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం

మరో పక్క తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వేకువజాము నుండే ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నిత్య సేవలు, కైంకర్యాల అనంతరం వేకువజాము 1.45 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. ముందుగా ప్రొటోకాల్ ప్రకారం వీఐపీలకు శ్రీవారి దర్శనానికి అనుమతించారు. అనేక మంది రాజకీయ, సినీరంగ ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు. కాగా బుధవారం శ్రీవారిని 25,542 మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు వచ్చినట్లు టీ టీ డీ వెల్లడించింది. 13,052 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


Share

Related posts

వకీల్ సాబ్ టీజర్ లో ఫ్యాన్స్ ఫీలవుతున్న పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అదే ..?

GRK

‘నిస్పృహతోనే రాద్ధాంతం’

somaraju sharma

Honda CB 350 RS : హోండా కొత్త బైక్ ఫీచర్స్ చూసేయండి..

bharani jella