NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో మరో బిగ్ ట్విస్ట్ .. సునీత దంపతులు, సీబీఐ అధికారిపై కోర్టు యండార్స్ కేసు నమోదు

Huge breaking news in YS Viveka case

YS Viveka Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా (వివేకానందరెడ్డి) హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారురాలైన వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, తొలుత కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కోర్టు యండార్స్ కేసు నమోదు అయ్యింది. వీరిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసారు.

Huge breaking news in YS Viveka case
YS Viveka case

వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలంటూ సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ తనపై ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని, ప్రత్యేకంగా ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.

ys viveka murder case cbi questions on ys sunitha reddy and rajasekhar reddy over letter
 ys sunitha reddy,  rajasekhar reddy

అప్పట్లోనే తాను ఎస్పీగా ఉన్న అన్భురాజన్ ను కలిసి తనకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్ లో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు .. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వారిపై ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అసలైన దోషులను శిక్షించాలని వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై సునీత అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, కుటుంబ కలహాలు, ఆర్ధిక వ్యవహారాల నేపథ్యంలో వివేకా హత్య జరిగిందని, సునీత భర్త రాజశేఖరరెడ్డి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చగా, ఆయన హైకోర్టు బెయిల్ పొందారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి తదితర నిందితులను సీబీఐ అరెస్టు చేయగా, చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

CM Revanth Reddy: మరో సారి హస్తినకు వెళ్లి రావలే .. రేపే రేవంత్ పయనం .. కేబినెట్ విస్తరణలో చాన్స్ కొట్టే దెవరు..?

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju