NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka case: అవినాష్ రెడ్డికి మరో సారి నోటీసులు ఇచ్చిన సీబీఐ .. ఈ సారి తప్పక హాజరుకావాలంటూ..

YS Viveka case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ (సోమవారం) విచారణకు హజరుకావాలని తెలిపారు. వాస్తవానికి అవినాష్ రెడ్డి ఈ నెల 16వ తేదీ విచారణకు హజరు కావాల్సి ఉండగా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హజరు కావడం లేదంటూ చివరి నిమిషంలో సీబీఐకి లేఖ రాసి విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఆ తర్వాత 19వ తేదీ విచారణకు రావాలని మరో నోటీసు ఇచ్చింది సీబీఐ. అయితే నోటీసు ఇచ్చిన మరోసటి రోజు అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ వెంటనే విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీం కోర్టు నుండి ఎటువంటి ఉపశమన ఉత్తర్వులు రాలేదు.

YS Avinash Reddy

 

ఈ నెల 19వ తేదీ విచారణ కు వస్తున్నట్లుగా సీబీఐకి సమాచారం ఇచ్చిన అవినాష్ రెడ్డి మరల చివరి నిమిషంలో తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని, తాను పులివెందులు వెళుతున్నాను అంటూ సీబీఐకి సమాచారం ఇచ్చి రెండో సారి డుమ్మా కొట్టారు. అయితే హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరిన అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఫాలో అయ్యారు. అయితే పులివెందులకు బయలుదేరిన అవినాష్ రెడ్డి .. తన తల్లిని పులివెందుల నుండి హైదరాబాద్ ఆసుపత్రికి షిప్ట్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో మార్గమధ్యలో ఆగిపోయారు.

పులివెందుల నుండి తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్లడం కంటే దగ్గరలోనే కర్నూలులో తీసుకువెళ్లడం మేలు అని భావించి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో అవినాష్ తెల్లి లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాలను పరిశీలించిన సీబీఐ అధికారులు కర్నూలు నుండి వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో సోమవారం (22వ తేదీ) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ మరో సారి నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు. ఈ సారి విచారణకు తప్పక హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు విచారణకు గైర్హజరైన ఆయన ఈ సారైనా విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

RBI: ఆర్బీఐ సంచలన ప్రకటన .. రూ.2వేల నోట్లు రద్దు..!

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju