ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జేసి బ్రదర్స్ కి తేల్చి చెప్పిన చంద్రబాబు..!? రిస్క్ చేయను..!?

Share

జేసి బ్రదర్స్ అంటే ఏపిలో తెలియని వారు ఎవరు ఉండరు. జేసి దివాకరరెడ్డి, జేసి ప్రభాకరరెడ్డి సోదరులు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎసెట్. అందుకే జేసి బ్రదర్స్ ఏమి మాట్లాడినా, ఏమి చేసినా పార్టీ నుండి అబ్దెక్షన్స్ ఏమి ఉండవు. సాధారణంగా చంద్రబాబు వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దు, వేరే నియోజకవర్గాల్లో పర్యటించవద్దు అని నాయకులకు పదేపదే చెబుతుంటారు. కానీ జేసి ప్రభాకరరెడ్డి మాత్రం తన తాడిపత్రితో పాటు ఆ జిల్లా మొత్తంలో తనకు తోచిన నియోజకవర్గాలకు వెళుతుంటారు. తోచి నట్లు మాట్లాడుతుంటారు. చంద్రబాబు అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేదు. స్వేచ్చను ఇచ్చారు. కాకపోతే రెండు అంశాల్లో మాత్రం చంద్రబాబుకు జేసి బ్రదర్స్ కు చాలా క్లీయర్ గా చెప్పేశారు. నేను రిస్క్ చేయను. మీరు ఈ విషయాల్లో నేను చెప్పినట్లు వినాల్సిందే అని. అసలు ఆ రెండు అంశాలు ఏమిటి.. ? దీని వల్ల జేసి బ్రదర్స్ కు ఏమైనా నష్టం ఉందా..? అనేది పరిశీలిస్తే..

వారసుల  పోటీ పై తర్జన భర్జన

వచ్చే ఎన్నికల్లో వాళ్ల వారసులు కాకుండా వాళ్లే పోటీ చేయాలని పార్టీ కోరుకుంటోంది. ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి, దివాకరరెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి లు 2019 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపి స్థానానికి పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లదరినీ గెలిపించాలని జేసి బ్రదర్స్ కంకణం కట్టుకున్నారు. వాళ్ల వారసులను రాజకీయ తెరపై సక్సెస్ నేతలుగా చూపించాలని అనుకుంటున్నారు. సో.. వచ్చే ఎన్నికలు జేసి బ్రదర్స్ వారసులకు పెద్ద పరీక్ష. కానీ పార్టీలో మాత్రం ప్రభాకరరెడ్డి, దివాకరరెడ్డి మీద సానుభూతి ఉంది. వాళ్లకు ప్రజల్లో మంచి పేరు ఉంది. వాళ్లు పోటీ చేయకుండా వాళ్ల వారసులను పోటీకి దింపితే కొంత ఓటింగ్ మైనస్ అవుతుందన్న భావన ఉంది. ప్రస్తుతం పార్టీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి రిస్క్ చేయకుండా వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుండి ప్రభాకరరెడ్డి, పార్లమెంట్ స్థానం నుండి దివాకరరెడ్డి పోటీ చేయాలని పార్టీ చెబుతోంది. వాళ్లు మాత్రం వారసులనే పోటీలో పెడతాం, వారుసుల రాజకీయ భవిష్యత్తుకు కీలకం, వాళ్లను గెలిపించుకుంటాం అని జేసి బ్రదర్స్ ఆలోచనగా ఉంది. ఈ విషయంలో కొంత తర్జన భర్జన జరుగుతోంది.

 

అలానే జేసి ఫ్యామిలీ కొన్ని నియోజకవర్గాల్లో వేలు పెడుతుంటారు. అనంతపురం అర్బన్, రాయదుర్గం, శింగనమల, కళ్యాణదుర్గం , పుట్టపర్తి తదితర నియోజకవర్గాల్లో వేలు పెడుతూ ఆ నియోజకవర్గాల్లో వాళ్లకు సీట్లు ఇవ్వాలి. వీళ్లకు సీట్లు ఇస్తే ఓడిపోతారు. తమ వర్గీయులకు సీట్లు ఇప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తుంటారు. సో .. ఈ విషయంలోనూ చంద్రబాబు నిర్మోహమాటంగా చెప్పేశారు. మీరు మీ సీట్లు చూసుకుండి. నూరు శాతం సక్సెస్ అవ్వండి, వేరే నియోజకవర్గాల్లో సిఫార్సులు చేయవద్దు అని చెప్పేశారుట.

ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దు

ఎందుకంటే.. రాయదుర్గంలో సీనియర్ నాయకుడు కాలవ శ్రీనివాసులు ఉండగా, ఆయనను కాదని వేరే వాళ్లకు సీటు ఇవ్వాలని జేసి బ్రదర్స్ సూచిస్తున్నారని సమాచారం. పుట్టపర్తిలో పల్లె రఘునాధరెడ్డి ఉండగా, ఆయనను కాదని జేసి ఫ్యామిలీ బంధువుకి టికెట్ ఇప్పించాలని చూస్తున్నారుట. అనంతపురం అర్బన్ లో ప్రభాకర చౌదరి ఉండగా, ఆయనను కాదని వేరే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో వీరు వేలు పెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వీళ్లతో విభేదాలు ఉండటం వల్ల వాళ్లకు సీట్లు ఇవ్వకూడదు అన్న ఆలోచన చేస్తున్నారని సమాాచారం. 2014 ముందు వరకూ జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాతనే వీళ్లు టీడీపీలోకి వచ్చారు. దీంతో పాత టీడీపీ నేతలతో వీళ్లకు గతం నుండి విభేదాలు ఉన్నాయి. ఉదాహారణకు చూసుకుంటే ప్రభాకర చౌదరికి, జేసీ కుటుంబానికి ఎప్పటి నుండి శతృత్వం ఉంది. అందుకని మీరు ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దు అని చంద్రబాబు జేసి సోదరులకు చెప్పేశారని వార్తలు వినబడుతున్నాయి. జేసీ ఫ్యామిలీకి కూడా వచ్చే ఎన్నికలు చాాలా కీలకం, అందుకే చంద్రబాబు చెప్పిన విషయాల పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని అంటున్నారు.


Share

Related posts

మిజోరంలో సీఎంన లాల్ తన్హావాలా ఓటమి

Siva Prasad

Pawan Kalyan : ఏపిలో పుర ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందన ఇదీ

somaraju sharma

Prakash raj: పోకిరి మూవీలో ఆలీభాయ్ రోల్ కాకుండా ఆ రెండు రోల్స్ చేసి ఉంటే ప్రకాష్ రాజ్ వేస్ట్ అనేవారా..?

GRK