NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu on Skill Development scam case:’తెలియదు .. గుర్తు లేదు..’

Advertisements
Share

Chandrababu on Skill Development scam case:ఏపీ స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అదినేత చంద్రబాబును శనివారం ఉదయం నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు అరస్టు చేసిన చంద్రబాబును రోడ్డు మార్గంలో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. సీఐడీ కార్యాలయంలో చంద్రబాబును సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఆడియో, వీడియో రికార్డింగ్ తో చంద్రబాబును అధికారులు విచారణ జరిపారు.

Advertisements

అయితే విచారణ సమయంలో చంద్రబాబు అధికారులకు సహకరించలేదని సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు దాట వేత ధోరణితో వ్యవహరించిన చంద్రబాబు ఎక్కువ శాతం తెలియదు, గుర్తు లేదు అన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తొంది. తాము సేకరించిన ఆధారాలను చంద్రబాబుకు చూపించి అధికారులు ప్రశ్నలను సంధించగా వాటికి సమాధానాలు చెప్పకుండా అధికారులనే ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి వివిధ సాక్ష్యాల ఆధారంగా 20 ప్రశ్నలను చంద్రబాబుకు అధికారుుల సంధంచారని సమాచారం. .

Advertisements

chandrababu reaction about CID comments

విచారణ మధ్యలో చంద్రబాబు అలసటగా ఉండటంతో విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించారుట. అదే విధంగా చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులు రాగా అవకాశం కల్పించారు. చంద్రబాబు సతీమణి భువనేస్వరి, బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లు చంద్రబాబును కలిశారు. విరామం తర్వాత మరల అధికారులు విచారణను కొనసాగించారు. ఇక స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ నకు సంబంధించి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలోని నోట్‌ఫైల్స్‌ను సిఐడి అధికారులు చూపించి మరీ ప్రశ్నించారుట.

స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్‌ సెక్రటరీ పేర్కొన్నట్టుగా ఉన్న ఓ నోట్‌ఫైల్‌ ను చంద్రబాబుకు అధికారులు చూపారుట. అంతే కాకుండా చంద్రబాబుకు, ఆయన పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్‌ చాట్‌లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను కూడా చూపి చంద్రబాబుకు ప్రశ్నలను సంధించగా, తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ సమాధానాలు ఇచ్చారుట.

మరో పక్క శనివారం ఉదయం అరెస్టు చేసిన చంద్రబాబును రాత్రి సమయానికి మెజిస్ట్రేట్ ముందు హజరు పరుస్తారని, వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్దం అయ్యారు. చంద్రబాబు తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుండి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూద్రా విజయవాడకు చేరుకున్నారు. అయితే శనివారం రాత్రి కూడా చంద్రబాబు ను విచారించి ఆదివారం వేకువ జామున న్యాయమూర్తి ఎదుట హజరు పర్చాలన్న ఆలోచనలో సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తొంది.

శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినందున 24 గంటల లోపు అఁటే ఆదివారం ఉదయం 6 గంటల లోపు న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చాల్సి ఉంటుంది. కావున ఆదివారం ఉదయం 5 గంటల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపిన తర్వాత చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హజరు పర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు సమర్పించిన తర్వాత ఏసీబీ కోర్టులో కస్టడీ విచారణ కొరకు పిటిషన్ దాఖలు చస్తారని అంటున్నారు.

Pawan kalyan Arrest: అనుమంచిపల్లి వద్ద జాతీయ రహదారిపై భైటాయించి పవన్ కళ్యాణ్ నిరసన.. పవన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు


Share
Advertisements

Related posts

YS Sharmila Party : షర్మిల “పంచాయతీ”లో జగన్ నెట్టుకొచ్చినట్టేనా..!? ఒకేరోజు రెండు కీలకాంశాలు..!

Muraliak

Chandra Babu: ఢిల్లీలో చంద్రబాబుకు చుక్కెదురు..! లభించని మోడీ, షా ఆపాయింట్‌మెంట్‌లు..! కారణం ఇదే..!!

somaraju sharma

Curry Leaves: ప్రతిరోజూ పరగడుపున 4 కరివేపాకులు ఆకులను తింటే బోలెడు ప్రయోజనాలు..!!

bharani jella