NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..

CM YS Jagan: ఏపి సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ లో 900 ద్విచక్ర వాహనాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు మూడువేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో కోటి 16 లక్షల మంది అక్కా చెల్లెమ్మలు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు.

CM YS Jagan launches Disha patrolling vehicles
CM YS Jagan launches Disha patrolling vehicles

 

CM YS Jagan: ప్రమాదం జరిగితే పది నిమిషాల వ్యవధిలోనే సాయం

మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని సీఎం జగన్ అన్నారు. ఈ దిశ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్ కి అనుసంధానమై ఉంటాయనీ, ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 9-10 నిమిషాల్లో దిశ సిబ్బంది అక్కడకు చేరుకుంటారని చెప్పారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ.13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్ కి రూ.5.5 కోట్లు వెచ్చించినట్లు సీఎం జగన్ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీఐజీ పాల్ రాజు, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju