Subscribe for notification

Jagan Davos Tour: జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విమర్శలకు మంత్రి బుగ్గన కౌంటర్..ఇదీ వాస్తవం అంటూ ఫుల్ క్లారిటీ

Share

Jagan Davos Tour: ఏపి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహనరెడ్డి దావోస్ వెళ్లడానికి కోర్టు నుండి అనుమతి తీసుకుని లండన్ వెల్లడంపై టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ దావోస్ కు వెళ్లడానికి మాత్రమే సీబీఐ కోర్టు అనుమతి ఉందా.. లండన్ వెళ్లేందుకూ అనుమతించారా అన్నదానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు యనమల. ఒక వేళ లండన్ వెళ్లేందుకు సైతం అనుమతి ఇస్తే అధికారిక పర్యటనలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఒక వేళ సిీబీఐ కోర్టు అనుమతి ఇవ్వకపోయినా జగన్ రెడ్డి లండన్ వెళితే అది కోర్టు దిక్కరణే అవుతుందని యనమల అన్నారు. రాష్ట్ర బృందం మొత్తం ఒకే విమానంలో వెళ్లకుండా సీఎం ప్రత్యేక విమానంలో వెళ్లడాన్ని తప్పుబట్టారు యనమల. అధికారులను వదిలివేసి భార్య, మరొకరితో మాత్రమే సీఎం ప్రత్యేకంగా వెళ్లడం లో లోగుట్టు ఏమిటని ప్రశ్నించారు. సొంత పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా అని నిలదీశారు. స్పెషల్ ఫ్లైట్ కు ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్ కు మరో ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటనీ, అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై ఇది అదనపు భారం కాదా అని ప్రశ్నించారు యనమల. జగన్ లండన్ పర్యటనపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఘాటుగా స్పందించి వివరణ ఇచ్చారు.

Jagan Davos Tour minister buggana reaction on yanamala comments

Jagan Davos Tour: టీడీపీ నేతలు మరీ అనామకుల్లా తయారు అవుతున్నారు

టీడీపీ నేతలు నానాటికీ అనామకుల్లా తయారవుతున్నారని విమర్శించారు బుగ్గన. సీఎం జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం టీడీపీకి, వారి అనుకూల మీడియాకు ఓ అలవాటుగా మారిందని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారికి కూడా విమాన ప్రయాణాలు, అంతర్జాతీయ నియామవళి పట్ల అవగాహన లేకపోవడం దారుణం అని అన్నారు. తాజా విష ప్రచారంతో టీడీపీ మరింత దిగజారిపోయిన విషయం స్పష్టమైందని అన్నారు బుగ్గన. ముఖ్యంగా యనమల తన వయసుకు తగిన విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు. సిగ్గులేకుండా సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బుగ్గన. జగన్ దావోస్ పర్యటనలో రహస్యమేమీ లేదని చెబుతూ సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఎప్పుడు ఏమిజరిగిందో వివరించారు బుగ్గన.

Jagan Davos Tour: లండన్ లో ల్యాండింగ్ అవ్వడానికి కారణం ఇదీ

గన్నవరం నుండి శుక్రవారం సీఎం జగన్ బయలుదేరిన విమానం మార్గమధ్యలో ఇంథనం నింపుకునేందుకు టర్కీలోని ఇస్తాంబుల్ లో అగిందన్నారు బుగ్గన. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఇస్తాంబుల్ లో ఆలస్యం అయ్యిందన్నారు. అక్కడి నుండి లండన్ చేరుకునే సరికి మరింత ఆలస్యం అయ్యిందనీ, లండన్ లో కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం జురెక్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా అప్పటికే షెడ్యుల్ సమయం (రాత్రి 10 గంటలు) దాటిపోయిందనీ, దీంతో అధికారులు ల్యాండింగ్ కోసం అభ్యర్ధన చేశారనీ, ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్ లోని భారత ఎంబసీ అధికారులు కూడా పాల్గొన్నారని చెప్పారు.

Read more: Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..! రాజకీయ వ్యూహంలో భాగమేనా..?

Jagan Davos Tour: వాస్తవాలు తెలుసుకుండా ఆరోపణలు

అయితే రాత్రి పది గంటల తర్వాత జురెక్ లో విమానాల ల్యాండింగ్ ను చాలా సంవత్సరాల క్రితమే నిలిపివేసినట్లు స్విట్జర్లాండ్ అధికారులు సమాధానమిచ్చారనీ, ఈ విషయాన్ని స్విట్జర్లాంట్ లోని భారత ఎంబసీ అధికారులు లండన్ లోని భారత దౌత్య సిబ్బందికి తెలియజేశారన్నారు బుగ్గన. దాంతో జురెక్ లో ల్యాండయ్యే వీలు లేక పోవడంతో సీఎం జగన్ కు లండన్ లోనే బస ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ ఉదయమే సీఎం జగన్ జురెక్ వెళ్లేందుకు సిద్ధం కాగా డీజీసీఏ నిబంధనలు అడ్డు వచ్చాయనీ, పైలెట్లు నిన్న అంతా ప్రయాణ విధులు నిర్వహించడంతో వారు నిర్ణీత సమయం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సీఎం జగన్ ప్రయాణంలో ఈ విధమైన పరిణామాలు జరిగితే టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాలో తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని బుగ్గన ఆరోపించారు.


Share
somaraju sharma

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

41 seconds ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

48 seconds ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

13 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago