NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan : అర్జంట్ అలర్ట్  జగన్ చెయ్యి జారిపోతున్న ఆ జిల్లా – వెంటనే అందుకోకపోతే మటాష్

YS Jagan: జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో స్థానిక సంస్థల్లో భారీగా విజయం సాధించబోతున్నాడు ?

YS Jagan : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చెప్పిన ఓ మాట సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను, సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. అది ఏమిటంటే తాను చంద్రబాబు మాదిరిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను అని తేగేసి చెప్పారు. ఈ నిర్ణయానికి ప్రశంసల వర్షం కురిసింది. గతంలో పార్టీలు మారిన నేతలను సంతల్లో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశారు అనే విమర్శలు చేసే వారు. ఒక పార్టీ నుండి గెలుపొంది మరో పార్టీ మారే నాయకుల పట్ల ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉండదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు  వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపిలతో పాటు పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు.  ఆ పరిణామం నాడు ప్రతిపక్ష పార్టీని కొంత బలహీన పర్చినప్పటికీ, టీడీపీలో కొత్తగా చేరిన నాయకులకు, పాత నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు, వర్గ వైషమ్యాలు ఆ పార్టీకే తీవ్ర నష్టాన్ని కల్గించాయి. చివరకు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

YS Jagan : Jagan should be careful about that district
YS Jagan : Jagan should be careful about that district

YS Jagan : పార్టీ ఫిరాయింపులపై సొంత పార్టీలోనూ అసంతృప్తి

జగన్మోహనరెడ్డి ఇప్పుడు చంద్రబాబు తరహాలో కాకుండా పరోక్ష పధ్దతిలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చారు. వాస్తవానికి జగన్ కు ఏ పార్టీ నుండి ఎవరూ అవసరం లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు 22 మంది పార్లమెంట్ సభ్యుల బలం ఉంది. రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఏకపక్ష తీర్పు ఇచ్చినా జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ సానుభూతి పరులుగా మార్చేసుకుంటున్నారు. ఇది ఆ పార్టీ నాయకులకూ నచ్చడం లేదు. వైసీపీకి చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు కట్టబెట్టినా పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్ ప్రభుత్వంలో ఉత్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తమకు పదవులు రాలేదని కొందరు అసంతృప్తితో ఉండగా కొత్తగా చేర్చుకున్న ఎమ్మెల్యేలు, నాయకులతో వైసీపీలో గ్రూపు రాజకీయాలు మొదలు అయ్యాయి. గతంలో టీడీపీలో ఉన్న పరిస్థితి ఇప్పుడు వైసీపీలో కనబడుతోంది.

YS Jagan : వైసీపీలో మూడు ముక్కలాట

ప్రకాశం జిల్లా చీరాలలో రెండు సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణ మోహన్ గత ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం గెలిచారు. టీడీపీలో కొనసాగితే తన కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన కరణం బలరాం వైసీపీ గూటికి చేరారు. కుమారుడు వెంకటేష్ ను అధికారికంగా పార్టీలో చేర్పించారు. అదే విధంగా ఈ నియోజకవర్గంలో వైసీపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పని చేసిన పోతుల సునీత, పాలేటి రామారావు వంటి నాయకులను జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. ఈ పరిణామంతో చీరాల నియోజకవర్గంలో మూడు గ్రూపులు అయ్యాయి. గత ఎన్నికల సమయంలో అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమంచి కృష్ణ మోహన్ చీరాలలో ఓటమి పాలైనా నియోజకవర్గంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజికవర్గ బలం లేకపోయినా 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి వ్యక్తిగత ఇమేజ్ ఉందని రుజువు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నేతల రాజకీయాల కారణంగా పార్టీ కోసం ఎప్పటి నుండో పని చేసిన తమకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. టీడీపీ నుండి వైసీపీలో చేరిన కొందరు నాయకులకు పార్టీ అదిష్టానంతో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు నేతల సహకారం కూడా లభిస్తుండటంతో చీరాలలో గ్రూపు రాజకీయం రసకందాయంగా మారిందట. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరిగితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని సగటు వైసీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట, వైసీపీ ఊహించని విధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు ముంచుకు వచ్చేశాయి. పార్టీ అధిష్టానం ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని అంటున్నారు. చూడాలి ఎమి జరుగుతుందో.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N