Raviteja : రవితేజ డ్యూయల్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘ఖిలాడి’. రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ప్లే స్మార్ట్’ అన్న ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఖిలాడీ’ సినిమాని 2021 సమ్మర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఖిలాడి సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో మరో సీనియర్ హీరో జాయిన్ అయ్యాడు. ఆయనే యాక్షన్ కింగ్ అర్జున్. ఈ విషయాన్ని తాజాగా అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Raviteja : ఇప్పటి వరకు ‘ఖిలాడి’లో అర్జున్ ఉన్నట్టు తెలీదు..?
‘2021లో కొత్త సినిమా.. ‘ఖిలాడి’ సెట్స్‌లో నేను’ అని క్యాప్షన్ పెట్టి క్లాస్ లుక్ లో ఉన్న ఒక పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అర్జున్. ఇప్పటి వరకు ‘ఖిలాడి’లో అర్జున్ ఉన్నట్టు తెలీదు.. ఇప్పుడు సడెన్‌గా రివీల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ తో రవితేజ ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ వర్మ. గత కొంతకాలంగా అర్జున్ ఫాదర్ క్యారెక్టర్స్ తో పాటు విలన్ క్యారెక్టర్స్ లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. నితిన్ ‘లై’ సినిమాలో విలన్ గా అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఫాదర్ గా నటించిన సంగతి తెలిసిందే.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!