Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు ఎవరూ లేకుండా రహస్య సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారంటే గన్నవరం విమానాశ్రయం మొదలు కొని పార్టీ కార్యాలయం వరకూ హంగామా ఉంటుంది. విమానాశ్రయం వద్ద జనసేన ముఖ్యనేతలు ఆయన స్వాగతం పలకడం, ఆ తర్వాత పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల హంగామా కనబడుతుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా నిన్న అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎటువంటి హంగామా లేకుండా పార్టీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

ముఖ్య నేతలు ఎవరూ లేకుండానే కీలక చర్చల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్. పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యనేతలు ఎవరూ లేరు. మీడియాకు అనుమతించ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వచ్చినా నాయకులు ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది, పవన్ కళ్యాణ్ భేటీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న రాత్రి, ఇవేళ పార్టీ కార్యాలయంలోనే ఉన్నా ముఖ్య నేతలతో ఎవరితోనూ పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించడం లేదు. కానీ పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో పవన్ భేటీ అయ్యారని వార్తలు వినబడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎవరితో సమావేశం అయ్యారు..? ఏ అంశాలపై చర్చలు జరుపుతున్నారు..? అంటే ఓ కీలక అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయాలని జనసేన భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఎలా ఉంది. ఎన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అయ్యింది. గెలుపు అవకాశాలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఏయే నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపిక చేయాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తొంది. రేస్ అనే సర్వే సంస్థతో పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం ఏకాంతంగా చర్చలు జరిపారనీ, ఇవేళ కూడా అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పార్టీ నుండి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
YS Viveka Case: సుప్రీం కోర్టులో ఎర్ర గంగిరెడ్డి బిగ్ షాక్ .. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే