NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత బాబు పోలీసులకు చెప్పింది అంతా కట్టుకథే(నా).. డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహం పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు ఇవీ..

MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత  ఉదయ భాస్కర్ అలియాస్ అనంత  బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వద్ద అనంత బాబు ఇచ్చిన వ్యాంగ్మూలంకు భిన్నంగా పోస్టుమార్టం నివేదిక లో విషయాలు వెల్లడి కావడంతో ఆనంతబాబు పోలీసు అధికారుల వద్ద చెప్పింది అంతా కట్టుకథేనని వెల్లడి అవుతోంది. ఆనంత బాబు అరెస్టు చూపిన సందర్భంలో జిల్లా ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ ఆనంత బాబు బలంగా వెనక్కి నెట్టడంతో అతను డ్రైనేజీ పడటంతో తలకు బలమైన గాయమైందనీ, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళుతుండగా కారులోనే మృతి చెందాడని చెప్పారు. దీంతో ఈ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద ఉంచి చెట్టు కొమ్మలతో చేతులు, భుజం, తొడలు, వీపుపై బలంగా కొట్టారని ఎస్పీ చెప్పారు. పోలీసుల విచారణ సందర్భంలో ఆనంత బాబు చెప్పిన విషయాలను ఎస్పీ ఈ విధంగా వెల్లడించారు.

MLA Anantha Babu driver Murder case sensational facts on postmortem report
MLA Anantha Babu driver Murder case sensational facts on postmortem report

MLC Anantababu: మరణానికి ముందే గాయాలు

అయితే సుబ్రమణ్యం మృతదేహంపై ఉన్న గాయాలు అన్నీ అతని మరణానికి 24 గంటల లోపే తగిలాయని, బలమైన వస్తువులతో అతన్ని జీవించి ఉండగానే కొట్టడం వల్ల అతని శరీరంపై 31 గాయాలు అయ్యాయనీ, అంతర్గతంగా మరో మూడు గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో ఈ విధంగా ఉండటంతో డ్రైవర్ సుబ్రమణ్యం ను కఛ్చితంగా కొట్టే చంపేశారనీ, అందులో ఎటువంటి అనుమానం లేదనీ టీడీపీ, జనసేన శ్రేణులు పేర్కొంటున్నారు. ఎస్పీ చెప్పిన వివరాలకు, సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదికకు ఎక్కడా పోలికే లేదని అంటున్నారు. సుబ్రమణ్యం నోరు, కళ్లు కొద్దిగా తెరిచి ఉన్నాయి. శరీరంలో అంతర్గతంగా రక్తస్రావమైంది. ఊపిరితిత్తులు కూడా కొద్దిమేర సాగాయి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత అతను మృతి చెందాడు అని రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నివేదిక ఇచ్చారు.

MLC Anantababu: ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ కు శ్యాంపిల్స్

మరో పక్క సుబ్రమణ్యం శరీర అవయవాల్లోని చిన్న చిన్న ముక్కల నమూనాలుగా సేకరించి విజయవాడలోని ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ తో పాటు రంగరాయ వైద్య కళాశాలలోని పాథాలజీ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపించారు. ఈ పరీక్షలు కూడా పూర్తి అయితే సుబ్రమణ్యం శరీరం లోపల ఇంకేమైనా భాగాలు దెబ్బతిన్నాయా లేదా అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నివేదికలు అధికారికంగా రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. ఎస్పీ చెప్పిన మాటలకు, పోస్టుమార్టం నివేదికకు పొంతన లేకుండా ఉన్న నేపథ్యంలో దీనిపై ఎస్పీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల నుండి డిమాండ్ వస్తొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N