ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Raghurama: సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు

MP Raghurama hot comments
Share

MP Raghurama: ఓ పక్క పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లుతూ అప్రతిష్ట పాలు చేస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల మరో మారు స్పీకర్ కు పిర్యాదు కూడా అందజేశారు. ఈ ఫిర్యాదుపై స్పీకర్ రఘురామకు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు షికారు చేశారు. ఈ తరుణంలో ఆయన తాను రాజీనామా చేయనని కూడా తెలిపారు. అయితే నేడు రాజీనామా అంశంపై ట్విస్ట్ ఇస్తూ మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వైసీపీ ఎంపిలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు.

MP Raghurama hot comments
MP Raghurama hot comments

Read More: Vijayashanthi: సీఎం కేసిఆర్ విధానాలను తూర్పారపడుతూ విజయశాంతి సెటైర్‌లు..

 

ఇక అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై ఆయన స్పందిస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ ఎంతో కాలం నుండి నిందిలు వేశారనీ, ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఎమంటారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారన్నారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి సీఎం జగన్ ఓదార్చాలని కోరారు.

 

విశాఖలో తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన రఘురామ కృష్ణం రాజు..నిజాయితీ గల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన పై అనర్హత వేటు పడదని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను పిటిషన్ వేస్తే రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

 

 


Share

Related posts

SBI Alert: ఎస్బిఐ ఖాతాదారులకు అలర్ట్..!!

bharani jella

జగన్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా: 2024లో కూడా ఇలా జరగాలంటే..??

sekhar

Smriti Irani: బెంగాల్‌లో దీదీకి ప్రత్యేర్థిగా ఫైర్ బ్రాండ్ మహిళా నేతను దింపిన బీజేపీ…!! వాట్‌ ఏ స్ట్రాటజీ..!!

somaraju sharma