NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తన బాణి మార్చారు. మొదటి సారిగా ప్రస్తుతం జగన్ సర్కార్ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్న సంక్షేమ పథకాలను అప్పులు చేసి మరీ కొనసాగిస్తున్నారు. జగన్మోహనరెడ్డి కాబట్టే ఇచ్చిన హామీ మేరకు వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలను యధావిధిగా అందిస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో వేరే ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయరనే భయం కూడా ప్రజల్లో ఉంది. ప్రజల భయాన్ని గమనించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంక్షేమ పథకలపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Pawan Kalyan

 

జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. మెరుగైన భవిష్యత్తు కోసం జనసేన పై నమ్మకం ఉంచాలనీ, మార్పు అంటే ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచితే గుండాలతో అయినా పోరాడతానని పునరుద్ఘాటించారు. ఉత్తరాంధ్ర జనసైనికులు కేసులకు భయపడవద్దని, కేసులు పెడితే తాను కూడా వస్తానని అన్నారు. రాజధాని పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంచనను ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని పవన్ ఆరోపించారు.

Pawan Kalyan

 

మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళుతున్నారనీ, జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పవన్ హామీ ఇచ్చారు. మత్స్యకారులకు హాని కలిగించే దేనినైనా జనసేన అడ్డుకుంటుందని తెలిపారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం తన సినిమాల ద్వారా వచ్చే సొమ్ము రూ.30 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N