NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరులపై హైకోర్టులో పిల్.. మ్యాటర్ ఏమిటంటే..?

AP High Court: ఏపి మంత్రి ఉష శ్రీ చరణ్ అనుచరులపై హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సర్వే నెం.329 లో సుమారు వంద ఎకరాల్లో ఉన్న సుబేదార్ చెరువును మట్టితో పూడ్చి ప్లాట్ లుగా అమ్ముకోవాలని మంత్రి అనుచరులు చూస్తున్నారని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ఉమామహేశ్వరరావు పిటీషన్ దాఖలు చేశారు. చెరువు ఆక్రమణలపై స్థానిక రెవెన్యూ అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకూ పిర్యాదు చేసినా ఫలితం లేదని అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఉమామహేశ్వరరావు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ  ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, కలెక్టర్, ఆర్డీఓలను చేర్చారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు..రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Petition against Minister Followers In AP High Court
Petition against Minister Followers In AP High Court

 

చెరువు ఆక్రమణలను అడ్డుకోకపోతే కళ్యాణదుర్గం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని టీడీపీ ఇన్ చార్జి ఉమామహేశ్వరరావ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ సర్వే నెం.329 లో 92.81 ఎకరాల భూమిని 1974 లో ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం తీసుకుందని రెవెన్యూ అధికారుల దృష్టికి ఉమా తీసుకువెళ్లారు. ఈ భూమిని సర్వే చేసిన అధికారులు అందులో 40 ఎకరాలు సుబేదార్ నీటి కుంటకు, 52.81 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు పట్టా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని అప్పట్లో నియమించిన కమిటీ తేల్చి చెప్పిందని అంటున్నారు. కళ్యాణదుర్గంలోని చెరువు ఆక్రమణ అంశం హైకోర్టుకు చేరడం, ఇందులో మంత్రి అనుచరులు ఉన్నారని ఆరోపణలు రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!