NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొడాలికి క‌త్తిలాంటి ఛాన్సిచ్చిన రాము.. ఇక కాస్కో నా సామిరంగా..!

అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. గుడివాడ అడ్డాలో కొడాలి నానికి తిరుగులేద‌నే టాక్ ఉంది. ఆయ‌న వ‌ర్గం ఇదే ప్ర‌చారంచేస్తుంది. ఇప్పుడు నానికి ఇదే ఛాన్స్ ఇచ్చారు టీడీపీ అభ్య‌ర్థి, ఎన్నారై నాయ‌కుడు వెనిగండ్ల రాము. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా నానికి ఆయ‌న‌కు స‌వాల్ రువ్వుతున్నారు. అదే.. త‌మ కూట‌మి చీల్చ‌డం.. త‌మ కూట‌మిలో పొర‌పొచ్చాలు వ‌చ్చేలా చేయ‌డం! ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజం. నిజానికి వెనిగండ్ల రాము అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. నాని త‌న గెలుపు మ‌రోసారి రాసిపెట్టుకోవ‌చ్చు అని అనుకున్నారు.

దీనికి కార‌ణం.. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రామును ప్ర‌క‌టించ‌డ‌మే. ఇలా చేయ‌డం ద్వారా .. కూట‌మిలో చిచ్చు ఏర్ప‌డుతుంద‌ని.. నాయ‌కులు విడిపోతార‌ని.. నాని లెక్క‌లు వేసుకున్నారు. కానీ, ఇక్క‌డే రాము నానికి స‌వాల్‌గా మారారు.ఏ లెక్క‌లైతే వేసుకుని నాని భ‌రోసాగా ఉన్నారో..ఆ లెక్క‌ల‌నే ఆయ‌న స‌రిచేసుకున్నారు. ముందు తాను ప్ర‌జ‌ల్లోకంటే… కూట‌మిలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ముఖ్య మని అనుకున్న రాము.. ఆదిశ‌గానే పావులు క‌దిపారు.

టికెట్ ఆశించిన సొంత పార్టీ నాయ‌కుడు రావి వెంక‌టేశ్వ‌ర‌రావును ఇంటికి వెళ్లి స‌ముదాయించారు. చేతులుక‌ల‌పాల‌ని కోరారు. ఆయ‌న మంచి మాట‌లు.. మ‌న‌సు చూసిన రావి.. చిన్న‌పిల్లాడిలా మారిపోయారు. రాము ఔదార్యానికి మంత్రంవేసిన‌ట్టు.. నేను ఉన్నానంటూ ముందుకు వ‌చ్చారు. దీంతో నాని లెక్క ఆదిలోనే ఫెయిల్ అయింది. రావి తిరుగుబాటు చేస్తాడ‌ని.. ఈ గంద‌ర‌గోళంలో త‌న గెలుపు మ‌రోసారి ఖాయ‌మ‌నుకున్న ఆయ‌నకు దిమ్మ‌తిరిగిపోయింది.

ఇక‌, రెండో వ్యూహం.. బీజేపీ, జ‌న‌సేన నేత‌లు క‌లిసి రార‌ని నాని అంచ‌నా వేసుకున్నారు.కానీ, ఇక్క‌డ రాము తెలివి ప్ర‌ద‌ర్శించారు. రాజ‌నీత‌జ్ఞ‌త ఆయుధానికి ప‌దును పెంచారు. ఆయాపార్టీల నేత‌ల‌ను వారి వారి కార్యాల‌యాల‌కే వెళ్లి క‌లుసుకున్నారు. రండి క‌లిసి ప‌నిచేద్దాం.. ఇది మ‌న నియోజ‌క‌వ‌ర్గం అని వారిని ఒప్పించారు. అంతే.. నాని లెక్క‌లు పూర్తిగా త‌ప్పాయి. ఇప్పుడు కూట‌మి అభ్య‌ర్థుల్లో కానీ.. కూట‌మి పార్టీల్లో కానీ.. ఎక్క‌డా చూద్దామ‌న్నా.. వ్య‌తిరేక‌త లేదు. పొర‌పొచ్చాలు అస‌లే లేవు.

ఇదీ.. నానికి రాము విసిరిన ప్ర‌ధాన స‌వాల్‌. కానీ, పొర‌పొచ్చాలు పెట్టేందుకు నాని నిరంత‌రం ప్ర‌య‌త్నిం చారు. అయినా.. రాము ఎంతో స‌హ‌నంతో ఓర్పుతో మాట‌ల‌కు ప‌నిచెప్ప‌కుండా.. చేత‌ల ద్వారా నాయ‌కు ల‌కు, ఆయా పార్టీల‌కు చేరువ‌య్యారు. ఇప్పుడురాము టీడీపీవాడు కాదు. అంద‌రి వాడు. అందుకే.. ఎలుగె త్తిన ఉత్సాహంతో మూడు పార్టీల నాయ‌కులు క‌లిసి ముందుకు సాగుతున్నారు. జెండాలు వేరైనా.. అజెండా ఒక్క‌టే అన్న‌ట్టుగా నాని ఓట‌మే క‌ళ్ల ముందు పెట్టుకుని.. ముందుకు న‌డుస్తున్నారు.

ఈ దెబ్బ‌తో నాని ఉక్కిరి బిక్కిరికి గురై… ఇదే నా చివ‌రి ఎన్నిక‌లు అనే ప‌రిస్థితి వ‌చ్చేసిందంటే.. ఏ రేంజ్‌లో రాము దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారో.. అర్ధం చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి నాని వేసిన లెక్క‌లు పూర్తిగా రివ‌ర్స్ అవుతున్నాయి. గుడివాడ‌లో నిన్నమొన్న‌టి వ‌ర‌కు ఉన్న నానికి వార్ వ‌న్‌సైడ్ అన్న నినాదం ఇప్పుడు పూర్తిగా మారుతోంది.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju