RGV : సాధారణంగా సెలబ్రిటీలకు, ప్రముఖులకు వారి అభిమానులు పుట్టిన రోజు సందర్భాలలో శుభాకాంక్షలు చెబుతుండటం, దానికి వారు ప్రతిగా థాంగ్స్ చెప్పడం రివాజు. కానీ విలక్షణ, సంచలనాత్మక దర్శకుడుగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మకు పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెబితే ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వర్మ తన విలక్షణ వ్యక్తిత్వాన్ని ఇక్కడా ప్రదర్శించారు. రామ్ గోపాల్ వర్మ రూటే సపరేటు అన్నది మరో సారి రుజువు చేసుకున్నారు.
విషయంలోకి వెళితే…నేడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జన్మదినం కావడంతో చాలా మంది ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే దీనికి రామ్ గోపాల్ వర్మ వెరైటీగా స్పందిస్తూ ఈ రోజు తన పుట్టిన రోజు కాదు, డెత్ డే, ఎందుకంటే తన జీవితంలో మరో సంవత్సరం ఈ రోజు చచ్చిపోయింది అంటూ కామెంట్ చేస్తూ ఏడుపు మొహం ఈమోజీని తగిలించారు. వర్మ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. హాపీ డెత్ డే అంటూ విషెస్ కూడా చెబుతున్నారు. వర్మకు తగ్గట్టుగానే ఆయన అభిమానుల ట్వీట్లు ఉంటున్నాయి. అయితే ఈ ట్వీట్‌తో పుట్టిన రోజుకు వర్మ కొత్త భాష్యం చెప్పినట్లు అయ్యింది.
No , it’s not my birthday but it’s my deathday today because one more year in my life died today ???
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2021
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!