NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

నిమ్మ‌గ‌డ్డ లాస్ట్ పంచ్ … రాజ్యాంగ సంక్షోభంలో జ‌గ‌న్‌?

CM Jagan VS Nimmagadda ; What Will happen?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు హాట్ హాట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే ! ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Poll On Ys jagan vs nimmagadda local body election In ap

ఇప్ప‌టికే మొత్తం ఏడుదశల్లో ఎన్నికలు నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఏపీ ఎస్ఈసీ శ‌నివారం మొదటి దఫా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. దీంతో ఒక్క‌సారిగా అంతా షాక్ తిన్నారు. మ‌రోవైపు ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేమని ఇప్పటికే ఉద్యోగసంఘాల నేతలు చెప్తున్నారు. నిన్న ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ కు అనేక జిల్లాలకు చెందిన అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకాలేదు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జగ‌న్ కేంద్రంగా కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ ను ఇరికిస్తున్నారా?

ఎస్ఈసీ వ్య‌వ‌హారంలో ఏపీ స‌ర్కారు పై తెలుగుదేశం పార్టీ సంచ‌ల‌న కామెంట్లు చేస్తోంది. అమెరికాలో ట్రంప్‌ తరహాలోనే ఆంధ్రాలో సీఎం జ‌గ‌ణ్‌ వ్యవహారం ఉందని మండిప‌డింది. “అమెరికా రాజ్యాంగానికి విరుద్దంగా ట్రంప్‌ వ్యవహరిస్తున్నట్లే జగన్‌మోహన్‌రెడ్డి భారత రాజ్యాంగానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్‌ 243 , 243 స‌బ్ రూల్ ఉల్లంఘించడమే. ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మా అడుగులకు మడుగులొత్తాల్సిందే అన్న విధంగా వ్యవహరించడం ఏమిటి? ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టులు చెప్పాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఎన్నికల సంఘం చేయాలని ఎక్కడా చెప్పలేదు. “ అంటూ విరుచుకుప‌డుతోంది.

 

స‌మ్మె చేస్తాం….

ఎస్ఈసీ తీరుపై ఏపీ ఎన్జీవోల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పింది. కరోనా టీకాలు వేశాకే విధుల్లోకి వెళ్తామని స్పష్టం చేసింది. తమ శవాల మీద నడుచుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తారా అని ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రాణాలు పొగొట్టుకోవాల్సిన అవసరం లేదని…అవసరమైతే సమ్మెకు సిద్ధమని ప్రకటించారాయన. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని.. దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

author avatar
sridhar

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju