కడప నగరంలోని పశు వైద్య శాఖలో డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. నిందితులు డా. సుభాష్ చంద్ర బోస్ (43 ), బావలూరి చెన్నకృష్ణ, మూడే బాలాజీ నాయక్ లను అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసు వివరాలు వెల్లడిస్తూ డాక్టర్ అచ్చన్న 2021 నుండి కడపలోని వెటర్నరీ పాలీ క్లినిక్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారనీ, నిందితుడు డా. సుభాష్ చంద్రబోస్ 2022 నుండి అదే ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నాన్నారు. డ్యూటీ విషయాలలో డాక్టర్ అచ్చన్న వర్సెస్ డాక్టర్ సుభాష్ చంద్ర బోస్ మధ్య కొన్ని తీవ్రమైన అపార్థాలు మరియు వివాదాలు వచ్చాయన్నారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న పై వైద్యులు మరియు సిబ్బంది జీతాలను మూడు నెలల పాటు నిలిపివేసి వారిని CFMS మరియు FRS సిస్టముల నుండి తొలగించి ప్రభుత్వానికి సరెండర్ కుడా చేశారన్నారు. దీంతో నిందితులు ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.

ఈ క్రమంలోనే డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తేదీ ఈ నెల 9వ తేదీన పోరుమామిళ్ల కు వెళ్లి అక్కడ వినాయక లాడ్జి లో తనకు వరుసకు బావ మరిది అయిన బావలురి చెన్న కృష్ణ ను, మెడికల్ స్టోర్ పార్ట్ నర్ అయిన మూడే బాలాజి నాయక్ ను లాడ్జిలో కలుసుకుని అక్కడే ఉండి 11వ తేదీ వరకు కుట్ర పన్ని సాయంత్రం నాలుగు గంటలకు బొలెరో పికప్ వాహనంతో కడపకు తిరిగి వచ్చారన్నారు. కడపకు వచ్చిన వారు ఏ 1 డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఇంట్లో బస చేసి మరుసటి రోజు అమలు చేయాలనే ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకున్నారన్నారు. 12 వ తేదీ ఉదయం 11.00 గంటలకు సీఎస్ఐ చర్చి సమీపంలోని చర్చి కి వెళ్లి వస్తున్న డాక్టర్ అచ్చన్న ను నిందితులు బలవంతముగా అపహరించి వాహనంలో ఎక్కించుకుని అదే వాహనములో రాయచోటి కి తీసుకుపొయారనీ, అతని చేత మద్యం త్రాగించి మరియు రాయచోటి శివార్లలో చికెన్ తినిపించి మద్యహ్నం సుమారు 1.30 సమయములో గువ్వల చెరువు ఘాట్ రోడ్డుకు చేరుకున్నాన్నారు. ఆ సమయములో అచ్చెన్న మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. డాక్టర్ అచ్చన్న ను చంపాలని ఉద్దేశ్యముతో ఏ 1 అతని చాతి పై బలంగా కాలితో తన్నగా ఘాట్ లోని రక్షణ గోడ నుండి లోయలో పడిపొవడంతో గాయాలయ్యాయన్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి వెళ్లిపోయారన్నారు. నిందితులు సాక్ష్యాధారాలను రూపు మాపేందుకు మృతుడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని, మొబైల్ ఫోన్‌ను ఒక చోట, సిమ్‌కార్డును మరో చోట పారవేసారన్నారు.
ఈ నెల 14న డాక్టర్ అచ్చన్న కుమారుడు కడప పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు పెట్టారనీ, ఫిర్యాదులో ఏ 1 డాక్టర్, ఇతర కార్యాలయ సిబ్బందిపై అనుమానితులుగా తెలిపారన్నారు. దర్యాప్తు సమయంలో నిందితుడు A1 మరియు మరి కొందరు అనుమానిత సిబ్బందితో పాటు మరణించిన వారి సీడీఆర్ లను పొంది విశ్లేషించారనీ, ఇది డాక్టర్ సుభాష్ చంద్రబోస్‌పై అనుమానాన్ని రేకెత్తించిందన్నారు. తదనంతరం తేదీ 24వ తేదీన గువ్వల చెరువు ఘాట్ వద్ద లోయలో డాక్టర్ అచ్చెన్న మృతదేహాన్ని గుర్తించిన రామాపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేసినారు. 26వ తేదీ సాయంత్రం ముగ్గురు నిందితులు కడప వీఆర్ఓ ఎదుట లొంగిపోయి తమ నేరాన్ని అంగీకరించారన్నారు. అనంతరం వారిని విఆర్ఓ కడప ఒకటవ పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎదుట హాజరుపర్చగా కేసుకు సంబంధించి చట్టంలోని సెక్షన్ 120(b), 364, 302, 201, r/w 34 IPC మరియు SC,ST (POA) చట్టం, 2015లోని సెక్షన్ 3 (2) (v-a)కి మార్చడం జరిగిందన్నారు. నిందితులు డా. అచ్చన్నను చంపినట్లు మరియు సాక్ష్యాలను రుపుమాపినట్లు అంగీకరించారనీ, వారి నుండి మృతుడి సిమ్ కార్డును స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కడప కోర్టులో హాజరుపర్చడం జరిగిందన్నారు.
రాపాక సారూ.. ఎమిటీ వ్యాఖ్యలు..! ఇది సోషల్ మీడియా యుగం.. ఆడేసుకుంటారు..!!