NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nellore GGH: ఆ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ ..! సమగ్ర విచారణకు ఆదేశం..!!

Nellore GGH: నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఆమె శుక్రవారం ఈ విషయంపై మాట్లాడారు. ఇటువంటి కామాంధులను ఉపేక్షించరాదని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ హౌస్ సర్జన్ లు ఇతర దిగువ స్థాయి మహిళా ఉద్యోగినులతో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

State women commission chair person serious on Nellore GGH issue
State women commission chair person serious on Nellore GGH issue

ఈ వ్యవహారంపై ఓ హౌస్ సర్జన్ నేరుగా ఆయనకు ఫోన్ చేసి క్లాస్ పీకిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన బండారం బట్టబయలు అయ్యింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితులు నిర్భయంగా వివరాలను మహిళా కమిషన్ కు వెల్లడించాలని సూచించారు. వాట్సాప్ నెం.9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని కూడా పద్మ తెలిపారు.

Read More: Murder: భార్య, కుమారుడుపై గొడ్డలితో దాడి..! భార్య మృతి, కుమారుడి పరిస్థితి విషమం – కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ప్రత్యక్ష దైవంగా భావించే వైద్య వృత్తిలో ఉన్న అధికారి ఆ వృత్తికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. సూపరింటెండెంట్ వైధింపులకు గురి అయిన వారు నిర్బయంగా తమకు ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా మహిళా కమిషన్ కోరింది.

కాగా రెండేళ్ల క్రితం ఇదే ఆసుపత్రిలో ఓ అధ్యాపకుడు వైద్య విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో నాడు ప్రభుత్వం అతనిని విధుల నుండి తొలగించి విచారణ కమిటీ వేసింది. అది జరిగిన రెండేళ్లకు ఇప్పుడు సూపరింటెండెంట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju