AP Politics: వైసీపీ సూపర్ ప్లాన్.. అందుకే మళ్ళీ రాజధాని రాజకీయం..!?

ysrcp raised three capitals again
Share

AP Politics: ఏపీ రాజకీయాలు AP Politics మళ్లీ మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది. రెండు రోజుల క్రితం ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం ఖాయం. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చు. అన్నారు. దీనికి కొనసాగింపుగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ‘విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరతాం. కోర్టు కేసులు పరిష్కరించుకుంటాం. ఈ ఏడాదని కాదు.. ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు ఉంటుంది. ఇందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. శాసనసభలో ఏ చట్టం చేశామో అది జరిగి తీరుతుంది’ అన్నారు. అయితే.. ఈ ప్రకటనలు అనేక అనుమానాలకు తావిస్తోంది.

ysrcp raised three capitals again
ysrcp raised three capitals again

ఇటివల ఏపీలో రాజకీయాలు బాగా హీటెక్కాయి. ముఖ్యంగా రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అంశం దేశవ్యప్తంగా చర్చల్లో నిలిచింది. ఆయన పుట్టినరోజు నాడే అరెస్టు దగ్గరి నుంచి సుప్రీంకోర్టు బెయిల్ వరకూ ఒక చోట.. ఒక విషయంపై మొదలైన టాపిక్ ఎన్నో మలుపులు తసుకుని మరెటో వెళ్లిపోయింది. ఆయన ఏపీ తీరుపై జాతీయ నాయకులను కలిసి ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. ఇవన్నీ సీఎం జగన్ కు చికాకు తెప్పించే అంశాలే. దీంతో వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. మూడు రాజధానుల అంశం తెర మీదకు తెచ్చారు. రాజధాని తరలింపు ఖాయం అన్నారు. ఇప్పుడే ఈ అంశంపై వీరిద్దరూ ఎందుకు మాట్లాడారన్నదే ఇప్పుడు ప్రశ్న. రఘురామ అంశాన్ని డైవర్ట్ చేసేందుకేనా? ప్రజల ఆలచనలు మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి.

Read More:Telangana Politics: రేవంత్ రెడ్డి బోనులోకి బీజేపీ.. టీఆరెస్..!?

నిజానికి ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. కరోనా కల్లోలంతో అల్లాడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వమే టేకప్ చేయలేని అంశం. పైగా.. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఉన్న వేరే విషయాలపై అయితే.. ‘ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు’ అనే నాయకులు.. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై ఎలా ప్రకటన చేస్తున్నారనేదే ప్రశ్న. ఇవన్నీ ఆలోచిస్తే.. రఘురామ అంశం తమను డ్యామేజీ చేస్తుందనే భయంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ఎత్తుగడ వేసి రాజధాని అంశాన్ని తెర మీదకు తెచ్చారని చెప్పాలి. లోగుట్టు ఇదేనా..? పాలకులే చెప్పాలి..!

 


Share

Related posts

కారెక్కనున్న కందాల

sarath

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో రూటు మార్చిన టిడిపి పార్టీ..!!

sekhar

YCP vs TDP; వైసీపీ ఫిర్యాదుకు టీడీపీ కౌంటర్..! బలేగుంది రాజకీయం..!!

somaraju sharma