ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నాకో న్యాయం..నా బావమరిదికి ఒక న్యాయమా.. జేసి సంచలన వ్యాఖ్యలు

Share

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి నేడు పోలీస్ అధికారుల అసోసియేషన్ పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ జిల్లా ఎస్పీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను ఉద్దేశించి “ఈ జిల్లాలో ఎన్ని రోజులు ఉంటావు, జాగ్రత్తగా ఉండు, ఎస్సీ, ఎస్టీ కేసులు రిజిస్టర్ చేయవద్దనడానికి నీకు ఏమి రూల్స్ ఉన్నాయి, నాతో పెట్టుకోవద్దు” అంటూ తీవ్ర స్థాయిలో ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. ఓ జిల్లా పోలీస్ అధికారిపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ఇంత వరకూ గట్టిగా స్పందించలేదు. ఖండిస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు తప్పించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.

tadipatri ex mla jc prabhakar reddy comments on police association

దీంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసి ప్రభాకరరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. పోలీసు అధికారుల సంఘం, సీఎం ముఖ్యసలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకు ఒక న్యాయం, నా బావ మరిదికి మరోక న్యాయమా” అంటూ పోలీస్ అధికారుల సంఘాన్ని నిలదీశారు జెసి ప్రభాకరరెడ్డి. “నా భార్య సోదరుడు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీని మూడు సార్లు దూషిస్తే కేసులు లేవు, నేను ఏమి మాట్లాడకపోయినా కడప జైలు నుండి వస్తుంటే ఏదో అన్నానని కేసు బనాయించి జైలుకు పంపారు” అని జెసి పేర్కొన్నారు. పోలీస్ అధికారుల సంఘం ఎన్ని రోజులు సజ్జల చేతిలో ఉంటుందని జేసి ప్రశ్నించారు.

tadipatri ex mla jc prabhakar reddy comments on police association

ఇప్పటికే పోలీసు వ్యవస్థ పరువు పల్చబడి పోయిందనీ ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని జేసి కోరారు. ఆయన చెబితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు కట్టాలా అని ప్రశ్నించారు. ప్రతి ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. “నేను మాజీ ఎమ్మెల్యేనే, ఆయన (నా బావ మరిది) మాజీ ఎమ్మెల్యేనే కాకపోతే నాది పచ్చ జండా, ఆయనది మూడు రంగుల జండా” అన్నారు జేసీ. యాక్షన్ తీసుకోవాలంటూ పోలీస్ అధికారుల అసోసియేషన్ కు జేసీ రిక్వెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..నెల్లూరు ఎస్‌పి పై వై‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్….!!


Share

Related posts

Today Gold Rate: ఈనెలలో 10సార్లు పెరిగిన బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ ఫాలో అవుతుందా..!? 

bharani jella

KTR to Vizag : కేటీఆర్ వస్తే విశాఖలో ఏం జరుగుతుంది?

Comrade CHE

జూలై 1 నుండి మళ్ళీ లోక్ డౌన్..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar