NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Botsa Satyanarayana: విద్యాశాఖ మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ .. ఆ విషయంపై పరిశీలిస్తామని హామీ

AP Minister Botsa Satyanarayana: ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117 రద్దు సహా ఉపాధ్యాయ బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. జీవో నెం.117లోని అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. చిత్తూరులో పదవ తరగతి వరకూ తెలుగు మీడియం కావాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తెలియజేయగా, ఇంగ్లీషు మీడియం అడ్మిషన్లనే ఇవ్వాలని మంత్రి బొత్స తేల్చి చెప్పారు.

Teachers Union Leaders meet AP Minister Botsa Satyanarayana
Teachers Union Leaders meet AP Minister Botsa Satyanarayana

ఒకటి నుండి 8వ తరగతి వరకూ నిర్బంధ ఇంగ్లీషు మీడియం విద్యను అమలు చేస్తామనీ, ఈ విధానంపై వెనక్కితగ్గేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 3,4,5 తరగతుల విద్యార్ధులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం జరుగుతుందన్నారు. 21 మంది విద్యార్ధులు ఉన్న చోట ఇద్దరు ఎస్జీటీలు ఉంటారని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల తెలియజేసిన సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశం అనంతరం ఉపాధ్యాయ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా 117 జివో పై సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి చెప్పారన్నారు. ప్రభుత్వం నిర్ణయం తర్వాత రేపు డీఈఓ కార్యాలయాల ముట్టడికి ఇచ్చిన పిలుపుపై పునరాలోచన చేస్తామని ఫ్యాఫ్టో చైర్మన్ తెలిపారు.

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju