NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

 చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత .. పోలీసులపై రాళ్ల దాడి ..వాహనాలు దగ్ధం

అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లా అంగళ్ల, పుంగనూరులో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్ షోలో రాళ్లు, చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్పీజీ కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో వైసీపీపై ధ్వజమెత్తారు.

 

మరో వైపు చంద్రబాబు అంగళ్లు నుండి పుంగనూరు బైపాస్ నుండి చిత్తూరు వైపు వెళ్లాల్సి ఉండగా, పుంగనూరు రోడ్డులో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. టీడీపీ శ్రేణులు పుంగనూరులో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. పోలీస్ వాహనాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులను ప్రయోగించారు. దీంతో పుంగనూరు బైపాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనలో జరిగిన ఘర్షణలో పోలీసులతో పాటు పలువురు వైసీపీ, టీడీపీ శ్రేణులు గాయపడ్డారు.

 

చంద్రబాబు పర్యటనలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని ఆసుపత్రికి తరలించామని, పోలీసులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. పోలీసులపై దాడి చేయడం అమానుషమన్నారు. పుంగనురులో మాజీ సీఎం పర్యటన లేదని, బైపాస్ మీదుగా ఆయన చిత్తూరు వెళుతున్నందున ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేశారని అన్నారు.

 

ఇవాళ విధ్వంసానికి పెద్దిరెడ్డి, పోలీసులు కారణమని చంద్రబాబు ఆరోపించారు. పుంగనూరు ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా అని ప్రశ్నించారు. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా, ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా అని పేర్కొన్నారు. తాను మళ్లీ పుంగనూరు వస్తానని అన్నారు.

Rahul Gandhi: ‘మోడీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్  

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?