ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vice President Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Share

Vice President Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పిన్నమనేని కోటేశ్వరరావు తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేశారన్నారు. వర్ధంతులు, విగ్రహాలు ఆవిష్కరించడం వల్ల వాళ్లకు ఒరిగేది ఏమిలేదన్నారు వెంకయ్యనాయుడు. వారి సిద్ధాంతాలను, స్పూర్తిని ప్రజలకు తెలియజేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. రాజకీయంగా పార్టీ మారకుండా అందరితో కలుపుకుని వెళ్లిన నాయకుడు పిన్నమనేని కోటేశ్వరరావు అని అన్నారు.

Vice President Venkaiah Naidu key comments
Vice President Venkaiah Naidu key comments

Vice President Venkaiah Naidu: రాజకీయాల్లో హుందాతనం లోపించింది

ప్రస్తుత రాజకీయాాల్లో హుందాతనం లోపించిందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో శాసనసభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కల్గిస్తోందన్నారు. వారసత్వంతో కాకుండా జవసత్వాలతో రాజకీయాల్లోకి రావాలని అన్నారు. కులం కన్నా గుణం మిన్న అన్న అనేది అందరూ తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నాయనీ, ఇది మంచి సంప్రదాయం కాదని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్ వస్తున్నదనీ, ఇది మంచిదేననీ, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎంపి కేశినేని నాని, తాజా మాజీ మంత్రి పేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

ఈ తప్పు చేస్తే జన్మలో బరువు తగ్గరు… మీ ఇష్టం!

Teja

ys jagan : బ్రేకింగ్ : సీఎం అయ్యాక మొట్టమొదటిసారి ఎన్నికల సభకు వస్తున్న జగన్..!!

sekhar

బజాజ్ ఫైనాన్స్ సంస్థకు భారీ జరిమానా!కస్టమర్లను కాల్చుకుతినడం పై ఆర్బీఐ సీరియస్!

Yandamuri