NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం..! సీబీఐ కస్టడీకి ఆ కీలక నిందితుడు..!!

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసు కుంది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శివశంకరరెడ్డిని కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన కడప సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టేందుకు శివశంకర్ రెడ్డిని కస్టడీకి అనుమతించాలని కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలు విన్న అనంతరం ఏడు రోజులు కస్టడీకి అనుమతికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కడప జైలులో ఉన్న శివశంకరరెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని డిసెంబర్ 2వ తేదీ వరకూ విచారించనున్నది.

Viveka Murder Case: sivasankar reddy cbi custody for 7 days
Viveka Murder Case sivasankar reddy cbi custody for 7 days

 

వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో దేవిరెడ్డి శివశంకరరెడ్డి పేరు ఉంది. శివశంకరరెడ్డి.. ఎంపి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాగా ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ వైసీపీ తరపున పులివెందుల పార్టీ వ్యవహారాలు చూస్తుండేవారు.  శివశంకరరెడ్డిని సీబీఐ ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో అదుపులోకి తీసుంది. ఆయనను కోర్టుకు హజరుపర్చిన సమయంలో ఎంపి అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడారు. శివశంకరరెడ్డిని వివేకా హత్య కేసులో అరెస్టు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. అయితే వివేకాను హత్య చేస్తే శివశంకరరెడ్డి రూ.40కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో ఈ నెల 15వ తేదీన కడపలో విచారణకు హజరుకావాలని శివశంకరరెడ్డికి సీబీఐ సమాచారం ఇచ్చినా ఆయన హజరు కాలేదు. ఆరోగ్యం బాగోలేదంటూ పులివెందుల నుండి హైదరాబాద్ వెళ్లి ఓ ఆసుపత్రిలో చేరారు. దీంతో సీబీఐ బృందం హైదరాబాద్ లో ఆయనను ఓ ఆసుపత్రిలో అదుపులోకి తీసుకుంది. శివశంకర్ రెడ్డి సీబీఐ విచారణలో ఏం చెబుతారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju