NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మరో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝులక్ ఇచ్చిన వైసీపీ .. నో టికెట్ అంటూ సమాచారం

YSRCP: అధికార వైసీపీ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తొంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించిన వైసీపీ.. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ల పరిస్థితిపై అంచనాలకు వచ్చి వారి స్థానాల్లో కొత్త ఇన్ చార్జిల నియామకానికి చర్యలు చేపట్టింది.

YSRCP

ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పినట్లుగా తెలుస్తొంది. ఆ ఎమ్మెల్యేలను అమరావతికి పిలిపించి పార్టీ పరిశీలకుడు ఈ విషయాన్ని నింపాదిగా చెప్పారుట. కొత్త నియమితులు అవుతున్న ఇన్ చార్జిలకు సహకరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలేకు ఆదేశించినట్లుగా తెలుస్తొంది. అయితే ఈ పరిణామాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారుట.

అధిష్టానం నిర్ణయంపై వారు ఆగ్రహం గా ఉన్నట్లు సమాచారం. అధిష్టానం సీటును నిరాకరిస్తుందని తెలియడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు తన అనుచరవర్గంతో సమావేశం నిర్వహించారు. జగ్గంపేట సీటు తనకు ఖాయమని మరో పక్క మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ నిర్ణయానికి వీరు బద్దులై ఉండి సహకరిస్తారా .. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాదిరిగా కీలక నిర్ణయాలను తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో చంటి బాబు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి చంటి బాబు విజయం సాధించారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులు పోటీ చేసే అవకాశం ఉండటంతో బలమైన బీసీ నేతలను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా సమాచారం.

Telangana Assembly: శాసనసభలో వాడివేడిగా చర్చ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !