NewsOrbit
Entertainment News Telugu TV Serials

Chi.La.Sow.Sravanthi: త్వరలో జెమినీ టీవీలో చి॥ల॥ సౌ॥ స్రవంతి సీక్వెల్…ఈ సూపర్ హిట్ సీక్వెల్ జెమినీ టీవీని స్టార్ మా నుండి కాపాడనుందా!

Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?

Chi.La.Sow.Sravanthi Sequel: కంటెంట్ ఉంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు ఎన్ని సంవత్సారలైన ఒక సీరియల్ ను ఆదరిస్తారు అనడానికి నిదర్శనం చిలసౌ స్రవంతి సీరియల్.. ఈ సీరియల్ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈ సీరియల్ 2006 నుండి 2011 వరకు ప్రసారం చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సుమారు ఐదున్నర సంవత్సారాలు ఈ సీరియల్ జెమినీ టీవీలో ప్రసారం చేశారు. అయినప్పటికీ వీక్షకులు ఈ సీరియల్ ను ఆదరించారు. ఈ సీరియల్ లోని తారాగణానికి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అటువంటి ఈ సీరియల్ కి మరోసారి సీక్వెల్ రానుంది అని తెలిసి సీరియల్ వీక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?
Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?

ఈ సీరియల్ తారాగణం మీనా వాసు, భరణి, నందకిషోర్, ప్రధాన తారాగణంగా తెరకెక్కించారు. స్రవంతి క్యారెక్టర్ లో మీనా వాసు జీవించిందని చెప్పవచ్చు అలానే మహేష్ క్యారెక్టర్ లో శాడిస్ట్ భర్తగా భరణి శంకర్ నటించారు. ఇక హీరో క్యారెక్టర్ నందకిషోర్ అమాయకంగా మంచితనంతో జగన్ పాత్రలో స్రవంతిని కాపాడి భరణి నుండి విముక్తిని కలిగించే, పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఈ సీరియల్ జెమినీ టీవీలో, అన్ని సీరియల్స్ కన్నా మంచి పిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది. మళ్లీ ఇటువంటి సీరియల్ జెమినీ టీవీలో రాలేదని చెప్పొచ్చు.

Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?
Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?

ఇక ఈ సీరియల్ చాలా అవార్డులను అందుకుంది ఈ సీరియల్ గోల్డెన్ నంది అవార్డులను బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డులను, మన ఎంటర్టైన్మెంట్ అందుకొని రికార్డును సృష్టించింది. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్, టైటిల్ సాంగ్ కూడా అవార్డు వచ్చిందంటే ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉత్తమ విధంగా భరణికి ఉత్తమ నటుడిగా నందకిషోర్ కి ఉత్తమ నటిగా మీ నాకు ఉత్తమ టైటిల్ సంఘ ఎస్ కిరణ్ కి, ఉత్తమ దర్శకుడిగా మీరు హుస్సేన్ కి అవార్డులు లభించాయి. వరుసగా నాలుగు సార్లు ఉత్తమ ప్రొడక్షన్ కి అవార్డు లభించింది అంటే, మన ఎంటర్టైన్మెంట్ ఎంతగా కృషి చేసిందో మనం గుర్తించొచ్చు. మొత్తంగా ఈ సీరియల్ 25 అవార్డులను అందుకుంది.

Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?
Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?

మొదట ఈ సీరియల్ ని పులి వాసు, మీర్ హుస్సేన్ ఇద్దరు డైరెక్ట్ చేశారు. పులి వాసు ఈ సీరియల్ మెయిన్ క్యారెక్టర్ (స్రవంతి) మీనా వాసుకి భర్త. పులి వాసు అంటే తెలియని వారు ఉండరు. ఇతను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సీరియల్స్ లో నటించారు. జీ తెలుగులో ప్రసారమయ్యే రామ సీత అగ్నిపరీక్ష సూర్యవంశం, సీరియల్స్ లో డైరెక్ట్ చేసి మెప్పించి, చాలా సీరియల్స్ కి డైరెక్షన్ చేశారు. ఇంకా చాలా సీరియస్ లో నటించారు కూడా. మీనా పులి వాసులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీనా వాసు చాలా సీరియల్స్ లో సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. మీనా వాసు పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . ప్రస్తుతం పులి వాసు స్టార్ మా, లో నాగ పంచమి సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

ఇక ఈ సీరియల్ నీ ప్రస్తుతం స్రవంతి -2 గా మన ముందుకు తీసుకురానున్నారు. ఈ సీరియల్, ఈ కొత్త స్రవంతి సీరియల్ జెమినీ టీవీలోనే ప్రసాదం కానుంది. పూర్వ తారాగణం నందకిషోర్, మీనా వాసు, భరణి, శంకర్ తో పాటు కొత్తగా మౌనిక, నిఖిల్, నటించనున్నారు. స్రవంతి క్యారెక్టర్ కి మౌనిక, రిషి క్యారెక్టర్ లో నిఖిల్ నటిస్తున్నారు. ఈ సీరియల్ లేటెస్ట్ ప్రోమో,విడుదల చేశారు. ఈనెల 25 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. సన్ నెక్స్ట్ లో కూడా ఈ సీరియల్ ని వీక్షించవచ్చు.

Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?
Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?

ఈ సీరియల్ ప్రోమో లో నందకిషోర్ ఒక పాపని ఒళ్లో కూర్చోబెట్టుకొని కథ చెప్పమని అడిగితే, అనగనగా ఒక రాణి, రాజకుమారుల్లా కనిపించే ఒక దుర్మార్గమైన విలన్, అని కథ చెబుతూ ఉండగా ఆ పాప మధ్యలో ఆపేసి నేను ఒక కథ చెప్తాను అని, నా కథలో ఒక అందమైన రాకుమారి, అందరితో కలిసి సరదాగా, ఆడుతూ పాడుతూ ఉంటుంది. తనకు నచ్చిన రాకుమారుడు చేయి పట్టుకొని రెక్కల గుర్రంపై ఎగిరిపోతుంది అని పాప చెప్పగానే.. నందకిషోర్ ఒకసారి అమ్మా స్రవంతి అని అరుస్తాడు అప్పటికే, హీరోయిన్ ఒక పంజరంలో ఉన్నట్టు హీరో విలన్ లాగా చూస్తున్నట్టు చూపిస్తారు.

Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?
Chi.La.Sow.Sravanthi: Will Super Hit Sravanthi Serial Sequel Save Gemini TV from Star Maa Serials Competition?

ఇక సెకండ్ ప్రోమో లో హీరో రిషి స్రవంతిని తీసుకొని దూరంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు చూపిస్తారు. స్రవంతి ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే నీకోసమే అని ఒక ప్రదేశానికి కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్లి ఒక అద్దాల మండపంలోకి పంపిస్తాడు. అక్కడికి వెళ్లిన స్రవంతి చాలా సంతోషంగా నా కోసమేదంతా చేశారా అని అంటుంది. బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటే డోర్ లాక్ చేసి నీ సంతోషాన్ని ,ఆనందాన్ని ఇకమీదట నేను బంధించాను. ఈ తాళాలు నా దగ్గరే ఉంటాయి. అని చెప్పేసి రిషి వెళ్ళిపోతాడు. స్రవంతి రిషి రిషి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఒక మధ్య తరగతి అమ్మాయి, ఎంతో ఊహించుకొని తన రాజకుమారుడు లాంటి భర్తని పెళ్లి చేసుకున్నాను .అని అనుకునేసరికి ఆ భర్త దుర్మార్గుడు అని తెలిస్తే.. ఆ అమ్మాయిని ఎవరు కాపాడతారు. ఆ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే ఈ కొత్త స్రవంతి 2 సీరియల్ ని చూడాల్సిందే..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella