AP Politics: వైసీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని చంద్రబాబు టీడీపీలో తీసుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు జగన్ తీవ్రంగా శ్రమించారు. సక్సెస్ అయ్యారు. నాడు వైసీపీని వీడి టీడీపీలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలను ఓడించేందుకు గత ఎన్నికల్లో గట్టిగానే కృషి చేశారు. వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరిన ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మినహా మిగిలిన 22 మంది ఓటమి పాలైయ్యారు. అయితే మరో ఏడాదిన్నరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీని దెబ్బతీసేందుకు జగన్మోహనరెడ్డి ఓ బిగ్ ప్లాన్ సిద్దం చేసినట్లుగా తెలుస్తొంది. నాడు చంద్రబాబు నాయుడు వైసీపీలో పదవిలో ఉన్న వారిని చేర్చుకోగా, ఇప్పుడు జగన్మోహనరెడ్డి ..టీడీపీలో బలమైన నాయకులుగా ఉన్న వారిని చేర్చుకుని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు సిద్దమైయ్యారు.

జయమంగళ వెంకట రమణతో మొదలు
రెండు నెలల వ్యవధిలో ఏపిలో 16 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటాలో 9, నామినేటేడ్ కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవ్వనున్న నేపథ్యంలో ఇవి అన్నీ కూడా వైసీపీకే దక్కుతాయి. అటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే ఖాయం. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక మార్చి నెలలో భర్తీ కానుండగా, నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక మే నెలలో జరగనున్నంది. వీటిలో మెజార్టీ ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ నుండి బలమైన నాయకులను చేర్చుకుని వారికి కట్టబెట్టాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. ఇలా చేయడం వల్ల ఆ పార్టీని బలహీనం చేసినట్లు అవుతుందన్న రాజకీయ వ్యూహం. ఈ క్రమంలో భాగానే ముందుగా కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గ నేత అయిన జయమంగళ వెంకటరమణను పార్టీలో చేర్చుకున్నది వైసీపీ. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. అలానే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇంకా కొంత మంది నాయకుల మీద కూడా వైసీపీ వల విసురుతోందని సమాచారం.

ఆ సీనియర్ నేతలపై వైసీపీ గురి
టీడీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న నాయకులపై వైసీపీ దృష్టి సారించింది. ఇదే క్రమంలో రాజకీయంగా సీనియారిటీ, వారి వల్ల టీడీపీకి మైనస్, వైసీపీకి ప్లస్ అవుతుంది అనుకున్న వాళ్లను ఎంపిక చేసి వాళ్లకు ఎమ్మెల్సీలు ఇవ్వాలని భావిస్తున్నదట. ఆ క్రమంలో భాగంగా ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీ ముఖ్యనేతలతో మంతనాలు కూడా సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రాజకీయ నాయకుల పార్టీ మార్పు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు జరుగుతూ ఉంటుంది. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంప్ చేస్తుంటారు. అయితే ఏపిలో రాజకీయ వాతావరణం ఇప్పుడే వేడెక్కింది. గతంలో శాసనమండలిలో టీడీపీ సభ్యుల బలం ఉండటం, మూడు రాజధానుల బిల్లుతో సహా పలు కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అసలు శాసనమండలినే రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వైసీపీ సర్కార్ … ఆ తర్వాత వైసీపీకి శాసనమండలిలో బలం చేకూరడంతో ఆ ప్రతిపాదననే విరమించుకున్నది. ఇప్పుడు ఆ శాసనమండలి (ఎమ్మెల్సీ) పదవులు ఎర వేసి టీడీపీని దెబ్బతీయాలని బిగ్ ప్లాన్ చేస్తున్నది. వైసీపీ ప్లాన్ కు ఎవరెవరు ఆకర్షితులు అవుతారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
తారకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు.. విజయసాయిరెడ్డి తో చంద్రబాబు