సినీ నటుడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పారాడి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతిక కాయం ఆయన స్వగృహానికి చేరుకుంది. హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్దకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి నివాళులర్పిస్తున్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు. విజయసాయి సతీమణి సోదరి కుమార్తె అలేఖ్య రెడ్డి. ఈ బంధుత్వం కారణంగా విజయసాయిరెడ్డి బెంగళూరులో తారకరత్న చికిత్స పొందుతున్న సమయంలోనూ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నందమూరి, నారా కుటుంబంలో పెను విషాదం .. 23 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన తారకరత్న
నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలో అన్ని చూసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా నుండి వచ్చిన వైద్యులు చికిత్స చేసినప్పటికీ తారకరత్నను బ్రతికించలేకపోయారు. ఇవేళ ఉదయమే తారకరత్న ఇంటికి విజయసాయిరెడ్డి చేరుకున్నారు. ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కుటుంబ సభ్యులతో తారకరత్నకు నివాళులర్పించారు. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని కళ్యాణ్ రామ్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు.
తారకరత్న కు అందించిన వైద్యంపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. రాజకీయంగా ప్రత్యర్ధులు అయినప్పటికీ తారకరత్న ఫ్యామిలీ పరంగా చంద్రబాబు, విజయసాయిరెడ్డి బంధువులు కావడంతో నివాళులర్పించిన సందర్భంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ప్రత్యేకంగా కనిపించింది. నారా లోకేష్ యువగళం పాదయాత్రను వాయిదా వేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. నందమూరి బాలకృష్ణ, లోకేష్ తదితర కుటుంబ సభ్యులు తారకరత్న ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ తారకరత్నకు నివాళులర్పించిన అనంతరం మీడియా ముందు సంతాప సందేశం ఇచ్చారు.
పాదయాత్ర అనుమతులు రద్దు చేసి వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు .. మహబూబాబాద్ లో ఉద్రిక్తత